AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayam Movie : జయం సినిమాలో గోపిచంద్ ప్రియురాలు గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో జయం ఒకటి. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకు మరో ప్రధాన బలం సాంగ్స్. ఇందులోని ప్రతి పాట సూపర్ హిట్టయ్యాయి. ఇందులో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

Jayam Movie : జయం సినిమాలో గోపిచంద్ ప్రియురాలు గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
Jayam Movie
Rajitha Chanti
|

Updated on: Apr 13, 2026 | 2:48 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో జయం సినిమా ఒకటి. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇందులో నితిన్, సదా హీరోయిన్లుగా నటించగా.. గోపీచంద్ విలన్ పాత్ర పోషించారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో గోపిచంద్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన బ్యూటీ గుర్తుందా.. ? ఈ మూవీలో ఆమె కనిపించింది కాసేపే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ బ్యూటీ రియల్ పేరు అనామిక ప్రవళిక. తెలుగుతోపాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

సీరియల్ నటిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. శిఖరం, సీతామహాలక్ష్మి వంటి సీరియల్స్ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. రాత్రి , రూ.999 మాత్రమే, సంభవామి యుగే యుగే, పిల్ల దొరికితే పెళ్లి ఇలా పలు చిత్రాల్లో నటించింది. కానీ జయం సినిమాతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎక్కువగా బోల్డ్ పాత్రలే వచ్చాయి. తమిళంలో నెపోలియన్ సరసన వీరన్న చిత్రంలో నటించింది. దాదాపు పది సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Rocket Raghava : జీవితంలో చెరుపుకోలేని తప్పు చేశా.. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా.. సారీ అన్నా.. రాకేట్ రాఘవ..

ప్రస్తుతం ఆమె పెళ్లి తర్వాత చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఒక బాబు ఉన్నాడు. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. మరో వైపు ఆమె సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Follow Us