పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న ఫ్యాన్స్ ను మాత్రం విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. అలాగే సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాల్లో అన్నవరం సినిమా ఒకటి. ఈ సినిమాలో పవన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నా కథ కనెక్ట్ అవ్వకపోవడంతో సినిమా నిరాశపరిచింది. ఈ సినిమాలో పవన్ ఎమోషన్స్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించి మెప్పించారు. అన్న చెల్లెలి మధ్య అనుబంధం చక్కగా చూపించారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా 2006లో విడుదలైంది. రమణగోగుల సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్నవరం సినిమాలో పవన్ కు జోడీగా ఆసిన్ నటించారు. అలాగే ఈ సినిమాలో పవన్ సిస్టర్ గా నటించిన నటి గుర్తుందా.?
ఆ నటి పేరు సంధ్య. అన్నవరం సినిమాలో నటించిన ఈ అమ్మడు అంతకు ముందు ప్రేమిస్తే సినిమాలో నటించింది. ప్రేమిస్తే సినిమాతో సంధ్యకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆఫర్స్ కూడా భారీగానే వచ్చాయి. కానీ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రేమిస్తే సినిమా తర్వాత అన్నవరం చిత్రంలో పవన్ చెల్లిగా చేసింది. అన్నవరం సినిమాలో వరలక్ష్మీ అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా సహజ నటనతో మెప్పించింది.
ఈ సినిమా కూడా సంధ్యకు సక్సెస్ మాత్రం రాలేదు. ఆతర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. 2015లో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది సంధ్య. ఇప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతోన్న సంధ్య సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ఆమెకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.