
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో చక్రం తిప్పిన ముద్దుగుమ్మ. అందం, అభినయంతో కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 20 సంవత్సరాలపాటు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. తెలుగులో ఇప్పటికీ ఆమెకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. కానీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలంగా మీడియాకు, ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. కొన్నాళ్ల క్రితం తిరుమలలో కనిపించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి తిరుమల శ్రీవారిలో పాల్గొన్నారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. సీనియర్ హీరోయిన్ రవళి.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
సీనియర్ హీరోయిన్ రవళి..తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో సూపర్ హిట్ అయిన పెళ్లి సందడి సినిమాతో పాపులర్ అయ్యింది. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవళి.. ముందుగా మలయాళంలో జడ్జిమెంట్ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత జయభేరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
కెరీర్ ప్రారంభంలో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తెలుగులో శుభాకాంక్షలు, ముద్దుల మొగుడు, చిన్నబ్బాయి, వినోదం వంటి చిత్రాల్లో నటించింది. చివరగా 2011లో మాయగాడు చిత్రంలో కనిపంచింది. 2007లో నీలికృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. చాలా కాలం తర్వాత తిరుమలలో కనిపించింది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?