Anitha Chowdary: ఓ సూరీడు.. ఈ టాలీవుడ్ నటి గుర్తుందా?ఆమె ఆ టాలీవుడ్ స్టార్ హీరోకు చెల్లెలు అని తెలుసా?

అనితా చౌదరి అంటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో 'ఓ సూరీడు.. బస్సుకు యాలైతాందిరా యాడికి పోయావ్' అంటూ అంధురాలి పాత్రలో కనిపించిన నటి అంటే ఇట్టే గుర్తుకు వస్తోంది. అయితే ఈ నటి ఒక టాలీవుడ్ స్టార్ హీరోకు చెల్లెలు అని మీకు తెలుసా?

Anitha Chowdary: ఓ సూరీడు.. ఈ టాలీవుడ్ నటి గుర్తుందా?ఆమె ఆ టాలీవుడ్ స్టార్ హీరోకు చెల్లెలు అని తెలుసా?
Anitha Chowdary

Updated on: Mar 06, 2025 | 8:35 AM

నటిగా, యాంకర్ గా.. ఇలా టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీ గుర్తింపు తెచ్చుకుంది అనితా చౌదరి. ఓ వైపు యాంక రింగ్, సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార వెండితెర మీద వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఓ ప్రముఖ చానెల్ లో ప్రసారమైన కస్తూరి సీరియల్ అనితకు మంచి పేరొచ్చింది. అలాగే రుతు రాగాలు, నాన్న సీరియల్స్ తోనూ బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది అనిత. ఇక వెండితెరపై కూడా సుమారు 50 కు పైగా సినిమాల్లో నటించిందీ అందాల తార. దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తాళి సినిమా తీస్తున్న సమయంలో హీరోయిన్‌ పాత్రకోసం అనితకు స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేశారట. అయితే షూటింగ్‌ ఆరునెలల పాటు రాజమండ్రిలో ఉంటుందని చెప్పడంతో అనిత ఆ సినిమా చేయలేదట. ఇక 1999లో ముప్పలనేని శివ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన రాజా సినిమాలో టీవీ యాంకర్ పాత్రలో తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనిత. దీని తర్వాత దాదాపు 50 సినిమాల్లో నటించిందీ అందాల తార.

మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, గోల్ మాల్, ఛత్రపతి, ఉయ్యాల జంపాల, మన్మథుడు, నిన్నే ఇష్టపడ్డాను, కేరింత, గురు, జాంబి రెడ్డి సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది అనిత. చివరిగా ఆమె 2022లో విడుదలైన కరణ్ అర్జున్ అనే సినిమాలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

అయితే అనిత సినిమాల గురించి అందరికీ తెలసిందే. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ టాలీవుడ్ నటి హీరో శ్రీకాంత్ కు చెల్లెలు వరుస అవుతుంది. అనిత, కృష్ణ చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కృష్ణ చైతన్య శ్రీకాంత్‌కు చాలా దగ్గర బంధువు అవుతాడు. అంతేకాకుండా వీళ్ల పెళ్లి కూడా శ్రీకాంతే దగ్గరుండి జరిపించాడట. ప్రస్తుతం అనిత, కృష్ణ చైతన్య దంపతులకు ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న అనిత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటోంది.

 

Anitha Chowdary, Srikanth

అనితా చౌదరి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.