
పేరుకు మలయాళ హీరోయినే అయినా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అన్ని చెప్పవచ్చు. తన అందం, అభినయంతో తెలుగు నాట జెట్ స్పీడ్ లో దూసుకెళుతోందీ అందాల తార. ఆ మధ్యన కాస్త డల్ అయినా మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైందీ క్రేజీ బ్యూటీ. బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి స్టార్ హీరోల సినిమాల్లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటున్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా?
తను మరెవరో కాదు భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించిన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. మలయాళంలో పలు సినిమాల్ల నటించిన సంయుక్త టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన బింబిసార కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమా తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిందీ అందాల తార. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల జాబితాలో చేరింది. ఇక ధనుష్ తో చేసిన బై లింగ్వల్ మూవీ సార్ కూడా సూపర్ హిట్ కాగా, కల్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
మొత్తానికి తెలుగులో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దూసుకెళుతోంది అందాల భామ సంయుక్త. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో స్వయంభు, అఖండ2 తో సినిమాలున్నాయి. అలాగే శర్వానంద్ తో కలిసి నారీ నారీ నడుము మురారి, బెల్లం కొండ శ్రీనివాస్ బీఎస్ఎస్ 12 మూవీలోనూ సంయుక్తనే హీరోయిన్. బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న అఖండ 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత సంయుక్త స్పీడ్ మరింత పెరగనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .