మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడీ హీరోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ దర్శకులను సైతం మెప్పించాడు చరణ్. కేవలం హీరోగానే కాకుండా.. బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు చెర్రీ. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యాడు. సినిమా, బిజినెస్ మాత్రమే కాకుండా.. చెర్రీకి గుర్రపు స్వారీ అంటే అమితమైన ఇష్టం. తన రెండవ సినిమా మగధీర చిత్రంలో తన ఫేవరేట్ గుర్రంపైనే స్వారీ చేశాడు. అంతేకాకుండా.. హైదరాబాద్ సమీపంలో ఓ క్లబ్‌ను ప్రారంభించాడు. ఇది అజీజ్ నగర్‌లోని మృగవాణి నేషనల్ పార్క్ సమీపంలో ఉంది.
హైదరాబాద్ పోలో, హార్స్-రైడింగ్ క్లబ్ అత్యుత్తమ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తుంది. క్లబ్ పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణంతో అందమైన సెట్టింగ్‌ను కలిగి ఉంది. ఆటను విశ్రాంతి, ఆనందించడానికి అనువైన ప్రదేశంగా చేస్తుంది. గుర్రపు స్వారీ ఇష్టమైనవారికి.. అలాగే హైదరాబాద్ లో రైడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలనుకునేవారికి ఈ క్లబ్ ట్రైనింగ్ ఇస్తుంది. పోలో ఎలా ఆడాలో నేర్చుకోవాలనుకునే వ్యక్తులకు.. అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు క్లబ్ గొప్ప ప్రదేశం.
అయితే ఈ క్లబ్ కోసం చరణ్ రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. గుర్రపు స్వారీ నేర్చుకోవాలనుకునే వారికి ఈ హైదరాబాద్ పోల్ అండ్ రైడింగ్ క్లబ్ అత్యాద్భుతమైన శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.