Director Shankar: కూతురు హీరోయిన్ కావాలనుకుంటే డైరెక్టర్ శంకర్ ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా ?.. చివరకు..
అలాగే తెలుగులో మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కూతురు కూడా కథానాయికగా అలరించేందుకు సిద్ధమయ్యారు.

ఇండస్ట్రీలో హీరోల తనయులు కథానాయికులుగా అరంగేట్రం చేయడం చూస్తుంటాం. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీలో, తమిళంలో, కన్నడలో, మలయాళంలోని స్టార్ హీరోస్ వారసులు ప్రస్తుతం టాప్ హీరోస్ గా వెలుగుతున్నారు. అయితే కేవలం దర్శకులు.. హీరోస్.. నిర్మాతల కుమారులు మాత్రమే కాదు.. ఇప్పుడు కూతుర్లు కూడా ఇడంస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు గాయనిలుగా.. మరికొందరు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఇప్పుడు కొందరు మాత్రం హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే కన్నడ హీరో అర్జున్ కూతురు హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. అలాగే తెలుగులో మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కూతురు కూడా కథానాయికగా అలరించేందుకు సిద్ధమయ్యారు.
పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి ప్రస్తుతం కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యింది. శంకర్‍కు ముగ్గురు సంతానం కాగా… వారిలో పెద్ద కూతురు అదితి. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో హీరోయిన్గా అడుగుపెట్టాలనుకుంది. ఇదే విషయాన్ని తండ్రితో చెప్పగా.. మొదట ఆయన ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని అదితి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.




హీరోయిన్గా సక్సెస్ అవ్వకపోతే తన కూతురు కెరీర్ నాశనం అవుతుందని శంకర్ నో చెప్పారట. కానీ ఒకవేళ తాను కథానాయికగా సక్సెస్ కాకపోతే చదువుకున్న వైద్య వృత్తిలో కొనసాగుతా అని అదితి చెప్పడంతో చివరకు శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అదితి చెప్పుకొచ్చింది. విరుమాన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో కార్తీ హీరోగా నటించగా.. ముత్తయ్య దర్శకత్వం వహించారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.