AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

350కి పైగా సినిమాలు.. హీరోయిన్‌గా తిరుగులేని స్టార్ డమ్.. నిర్మాతగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న నటి

ఈ స్టార్ హీరోయిన్ సినీ ప్రస్థానం ఎన్నో మలుపులు, సవాళ్లతో కూడుకున్నది. వివాహితుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నుంచి, భారీ నష్టాలతో ఆమె సొంత నిర్మాణ సంస్థతో నిర్మించిన సినిమా వరకు అనేక ఆర్థిక, వ్యక్తిగత కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. తోటి కళాకారులకు ఆమె చూపిన దాతృత్వం, పరోపకారం ఆమెను సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి.

350కి పైగా సినిమాలు.. హీరోయిన్‌గా తిరుగులేని స్టార్ డమ్.. నిర్మాతగా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్న నటి
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2026 | 9:18 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటి అంజలీదేవి గారిది ఒక అరుదైన వ్యక్తిత్వం, అజేయమైన సంకల్పానికి ప్రతీక. పెదపురంలోని బొమ్మూరు గ్రామంలో అంజనమ్మగా జన్మించిన ఆమె, చిన్నతనం నుంచే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. రాజేశ్వరి, గొల్లభామ వంటి చిత్రాలతో తన నటనకు ప్రాణం పోసిన అంజలీదేవి, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అంజలీదేవి వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో సవాళ్లతో కూడుకుంది. అప్పటికే వివాహితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనాటి సంప్రదాయ సమాజంలో ఈ వివాహం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, అంజలీదేవి తన ప్రేమకు కట్టుబడి, భర్తకు అండగా నిలిచారు. ఆదినారాయణరావు సినీ కెరీర్‌లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు, ఆమె తన సంపాదన మొత్తాన్ని ఆయనకు వెనక నిలబెట్టారు. భర్త వ్యాపార భాగస్వాములు మోసం చేసినా, ఆర్థికంగా తీవ్ర నష్టాలు వచ్చినా, ఆమె ఎప్పుడూ ఆయన్ని నిందించలేదు, పైగా మరింత ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. మద్రాసులో ఇంటిని నడుపుకుంటూ, షూటింగ్‌లకు వెళుతూ, ఆదినారాయణరావుకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలిచారు.

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

కేవలం నటిగానే కాకుండా, అంజలీదేవి ఒక నిర్మాతగా కూడా తన ముద్ర వేశారు. తన సొంత నిర్మాణ సంస్థ అంజలీ పిక్చర్స్ ద్వారా ఆమె కొన్ని గొప్ప చిత్రాలను నిర్మించారు. వాటిలో అనార్కలి చిత్రం ఒక మైలురాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ చిత్రం నిర్మాణంలో అంజలీదేవి ఊహించని నష్టాలను చవిచూశారు. అనార్కలి షూటింగ్ దాదాపు రెండున్నర సంవత్సరాలు సాగింది. రంగుల్లో తీయాలనే పట్టుదల, దర్శకుడి మార్పు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల బడ్జెట్ భారీగా పెరిగింది. భారీగా డబ్బు ఖర్చయినా, విడుదలలో ఆలస్యం, వివాదాలు ఆమెను ఆర్థికంగా దెబ్బతీశాయి. సొంత ఇల్లు, ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అంజలీదేవి ఈ సినిమాను పూర్తి చేశారు. అయినప్పటికీ, ఆమె తన పట్టుదలను వీడలేదు.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

అంజలీదేవి స్వభావరీత్యా ఎంతో బలమైన వ్యక్తి. తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటానికి ఆమె వెనుకాడలేదు. ఎందరికో సాయం చేసి, అమ్మలాంటి మనిషిగా పేరుపొందారు. ఆమె సాయం పొందిన వారిలో కృష్ణకుమారి వంటి వారు కూడా ఉన్నారు. తన చుట్టూ ఉన్నవారికి ఆమె చూపిన కరుణ, ఆప్యాయత ఆమెను కేవలం నటిగానే కాకుండా, ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా నిలిపాయి. ఆర్థికంగా తాను ఎన్నో నష్టాలు చవిచూసినా, చివరి వరకు ఆమె తన ఆత్మాభిమానాన్ని, సాయం చేసే గుణాన్ని వదులుకోలేదు.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us