అప్పుడు సీడీలు అమ్మేవాడు.. కట్ చేస్తే టాలీవుడ్‌లో తోపు డైరెక్టర్..

ఇండస్ట్రీలో ఆయన ఓ స్టార్ డైరెక్టర్.. ఆయన చేసిన సినిమాలకు ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆయన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు సీడీలు అమ్మిన ఆయన ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?

అప్పుడు సీడీలు అమ్మేవాడు.. కట్ చేస్తే టాలీవుడ్‌లో తోపు డైరెక్టర్..
Rgv

Updated on: Oct 24, 2025 | 2:50 PM

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అనేది పెద్ద సవాలు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అవకాశాల కోసం నిత్యం వందలాది మంది సినిమా ఆఫీస్ ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతుంటారు. అలాగే ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న కొందరు గతంలో చిన్న చిన్న పనులు చేసి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చిన వారే అలాగే ఓ టాప్ దర్శకుడు సినిమాల్లోకి రాక ముందు సీడీలు అమ్మేవాడు. ఇప్పుడు ఆయన పేరే ఓ సెన్సేషన్. ఆయన సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అవుతాయి. ఇంతకూ ఆ సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరో తెలుసా.? ఒకప్పుడు తోప్ దర్శకుడు.. కానీ ఇప్పుడు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు అతను.

ఒకే ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే 260కు పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్

ఆయన ఎవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అభిమానులు, ప్రేక్షకులు ముద్దుగా ఆర్జీవి అని పిలుస్తుంటారు. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండేది. థియేటర్స్‌కు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతున్నాయి. ఎవరి పైన సినిమా తీస్తున్నాడో..? ఎలాంటి సినిమా తీస్తున్నాడో అని అందరూ అలర్ట్ అవుతున్నారు. శివ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమాకి కో డైరెక్టర్ గా శివ నాగేశ్వరరావు పనిచేశారు.

ఇవి కూడా చదవండి

ప్రభాస్‌కు అమ్మగా, గోపిచంద్‌కు వదినగా చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

అయితే ఆర్జీవీ సినిమాల్లోకి రాకముందు ఓ ఉద్యోగం చేసేవారట.. ఒకరోజు రామ్ గోపాల్ వర్మ ఎదో పని మీద వెళ్తూ.. ఓ సీడీ షాప్ దగ్గర ఆగారట. ఆ షాప్ ఆయనను ఎట్రాక్ట్ చేసిందట. అలాంటిది స్టార్ట్ చేయాలని అనుకున్నారట. దాంతో రూ. 5000లతో సీడీల షాప్ మొదలుపెట్టారట. అమీర్ పేట్‌లో ఆర్జీవీ షాప్ పెట్టారట. అందులో హాలీవుడ్ సినిమాలు చూసి ఎవరైనా సీడీ కొనడానికి వస్తే ముందు ఆ సినిమా కథను చెప్పేవాడట ఆర్జీవీ. వర్మ చెప్పే కథ ఆసక్తిగా ఉండటంతో సీడీలు కొనేవారట. అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన సురేంద్ర అక్కినేని వెంకట్ కూడా అక్కడికి వచ్చేవాళ్ళట. అలాగే వర్మ వాళ్ల నాన్న కూడా అన్నపూర్ణ స్టూడియోలో పని చేసేవారట.. దాంతో అక్కినేని ఫ్యామిలీతో వర్మకు పరిచయం ఏర్పడిందట. అలా అక్కినేని వెంకట్ సురేంద్ర పరిచయం వలన శివ సినిమా అవకాశం దక్కిందట. అప్పటికీ సినిమాల పై వర్మకు పెద్దగా అవగాహన లేకపోయినా అద్భుతంగా సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టారట.

బుర్రపాడు సిరీస్ రా బాబు..! మిస్టరీ గదిలో పిచ్చెక్కించే అమ్మాయిలు..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి