రూ.70 కూలికి చాక్లెట్ కంపెనీలో పని చేసింది.. ఇప్పుడు సీరియల్స్‌లో స్టార్ ఆమె.. ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చినవారే.. సినిమాల్లోనే కాదు సీరియల్స్ లోనూ నటిస్తూ చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో ముఖ్యంగా సీరియల్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫొటోలో ఉన్న సీరియల్ నటిని గుర్తుపట్టారా.?

రూ.70 కూలికి చాక్లెట్ కంపెనీలో పని చేసింది.. ఇప్పుడు సీరియల్స్‌లో స్టార్ ఆమె.. ఎవరో తెలుసా.?
Actress

Updated on: Jul 30, 2025 | 7:07 PM

సినిమాలతోనే కాదు సీరియల్స్ ద్వారా కూడా చాలా మంది పాపులర్ అయ్యారు. సినిమా సెలబ్రటీలకు మించి సీరియల్ బ్యూటీస్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కొంతమంది సీరియల్స్ నుంచి సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నవారు ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు.. కెరీర్ బిగినింగ్ లో ఎంతో మంది ఎన్నో కష్టాలు పడి సక్సెస్ అయ్యారు. కొంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు చిన్న చిన్న జాబులు చేసి ఫ్యామిలీని పోషించుకున్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ మాట్లాడుతూ.. తాను రూ. 70రూపాయిలకు కూలీగా పని చేశా అని తెలిపింది. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె ఇప్పుడు సీరియల్స్ లో స్టార్ గా మారిపోయింది. ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్‌లో ఇల్లుఇల్లాలుపిల్లలు సీరియల్ ఒకటి.  ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ప్ ప్రభాకర్, ఆమనీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సీరియల్ లో నర్మద పాత్రలో నటించిన నటి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు అన్షు రెడ్డి. ఈ చిన్నది తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చక్కటి అభినయం కనబరుస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

గడుసరి కోడలిగా సీరియల్ లో కనిపించిన ఈ చిన్నది మెప్పించింది. ఈ సీరియల్ కంటే ముందు చాలా సీరియల్స్ లో నటించి మెప్పించినది అన్షు రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడింది. నా అసలు పేరు అనూష, కానీ ఇంట్లో అన్షు అని పిలుస్తుంటారు. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు స్టార్ మహిళ గేమ్ షో పాల్గొన్నా.. ఆ షోలో చూసి నన్ను ఆడిషన్స్‌కి పిలిచారు అని తెలిపింది. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు 15 గేమ్ షోల్లో పాల్గొన్నా.. అదేవిధంగా శ్రావణ సమీరాలు సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. మాది వరంగల్ మేము హైదరాబద్ లో సెటిల్ అయ్యాం.. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిపడ్డం.. ఓ చాక్లెట్ కంపెనీలో వర్క్ చేశా.. 12గంటలు కష్టపడితే డైలీ రూ.70 ఇచ్చేవారు. అలాగే రూ. 3 రూపాయిల బస్ టికెట్ సేవ్ అవుతుందని ఆరు మైళ్లు నడిచేదాన్ని.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా.. మా అమ్మ నాతో వచ్చేది. నేను యాక్టర్ అవుతానని అనుకోలేదు యాక్టర్ అవుతానని అనుకోలేదు. అనుకోకుండా అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.