
ఎంతో మంది హీరోయిన్ చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి ఆతర్వాత హీరోయిన్ గా మారుతుంటారు. మరికొంతమంది కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాతిహా మెయిన్ హీరోయిన్స్ గా మారిపోతుంటారు. అలాగే ఎంతో మంది పలు యాడ్స్ లో కనిపించి ఆతర్వాత హీరోయిన్ అవుతుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కేవలం 8 నెలల వయసు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చంటి బిడ్డగా ఉన్నప్పటి నుంచే నటించడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్ గా రాణిస్తుంది. అంతే కాదు మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషల నుంచి ఎంతో మంది హీరోయిన్స్ వచ్చి మన దగ్గర పాపులర్ అవుతున్నారు. అలనాటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కియారా అద్వానీ మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే పక్కింటమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ చిత్రం నిరాశపర్చినా చెర్రీ, కియారాల జోడికి మంచి పేరు వచ్చింది. ఇటీవలే మరోసారి చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిందీ అందాల తార..
ఇదిలా ఉంటే కియారా అద్వానీ 8 నెలల పాపగా ఉన్నప్పుడే నటించడం మొదలు పెట్టింది. లెజెండరీ యాక్టర్లు అశోక్ కుమార్, సయీద్ జాఫ్రీలకు కియారా దగ్గర బంధువు.. ఆ బ్యాగ్రౌండ్ తోనే 8 నెలల పాపగా ఉన్నప్పుడే ఓ బేబీ ప్రొడక్ట్ యాడ్ లో నటించింది. కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంది. అప్పటికె ఇండస్ట్రీలో అలియా భట్ స్టార్ గా రాణిస్తుంది. దాంతో సల్మాన్ ఖాన్ సలహాతో పేరు మార్చుకుంది. అంజానా అంజానీ సినిమాలో ప్రియాంక చోప్రా పాత్ర పేరు కియారా.. అది ఆమెకు బాగా నచ్చడంతో తన పేరు కియారా అద్వానీగా మార్చుకుంది. ఇక ఈ అమ్మడు సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇటీవలే కియారా అద్వానీ తల్లి అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి