22 ఏళ్లకే ఇండస్ట్రీని ఊపేసింది.. తొలి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేసిన కొత్త భామ

కొంతమంది హీరోయిన్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది స్టార్ డమ్ కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కాగా ఓ 22ఏళ్ల హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె కోసం కుర్రాళ్లు సోషల్ మీడియాను గాలిస్తున్నారు.

22 ఏళ్లకే ఇండస్ట్రీని ఊపేసింది.. తొలి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేసిన కొత్త భామ
Actress

Updated on: Feb 26, 2026 | 10:37 AM

రీసెంట్ డేస్ లో కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే మన దగ్గర యంగ్ బ్యూటీస్ చాలా మంది. ఒకొక్క సినిమాకు ఒకొక్క హీరోయిన్ పరిచయం అవుతుంది. అయితే ఓ ముద్దుగుమ్మ మాత్రం ఇండస్ట్రీలో నాయా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 22ఏళ్ల ఆ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె తొలి సినిమానే వందలకోట్ల కలెక్షన్స్ రాబట్టింది. స్టార్ హీరోలు కూడా ఆమె నటనకు, అందానికి ఫ్లాట్ అయ్యారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఓ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఆ సినిమాతో 22 ఏళ్ల హీరోయిన్ రికార్డ్స్ తిరగరాస్తుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు అనీత్ పద్ద. వయసు 22 సంవత్సరాలు. పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించిన ఈ వయ్యారి.. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయ్యారా సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. జూలై 18న విడుదలైన ఈ సినిమా రూ. 570 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అనీత్ పద్ద. అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి ట్రై చేశారు. అనీత్ పద్ద.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేస్తుందట. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అనీత్ పద్ద. ఇప్పటికే పలు యాడ్స్ చేసింది. ఇక సయ్యారా సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే ఊహించని విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ సుందరి.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సయ్యారా సినిమాపై చాలా మంది సెలబ్రెటీలు, స్టార్ హీరోలు కూడా ప్రశంసలు కురిపించారు. హీరోహీరోయిన్స్ పై పొగడ్తలు కురిపించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us