
సినిమా ఇండస్ట్రీని తన అందంతో, నటనతో చెరిగిపోని ముద్ర వేశారు శ్రీదేవి. వయసుతో సంబంధం లేకుండా ఎన్నోరకాల పాత్రల్లో నటించారు. వయసులో తనకన్నా పెద్ద హీరోలతో నటించారు. అలాగే తనకన్నా చిన్న హీరోలతోనూ నటించారు శ్రీదేవి. తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీదేవితో పాటు అందంలోనూ, నటనలో పోటీ పడ్డ అందాల భామలు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ. ఆమె ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. మతిమరుపుతో బాధపడుతుంది ఆమె.. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఒకప్పుడు అందం అభినయం కలబోసిన హీరోయిన్స్ ఇప్పుడు చాలా మంది గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సడన్ గా చూస్తే ఆ హీరోయిన్ ఈమేనా అనేంతగా అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇక తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలంటి అలనాటి మేటి తారల్లో భానుప్రియ ఒకరు. భాను ప్రియా దాదాపు 155 సినిమాల్లో నటించి అలరించారు. ఆమె అందానికి అభినయానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది అప్పట్లో..తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో తనదైన ముద్ర వేశారు భానుప్రియ. భాను ప్రియా అసలు పేరు మంగభాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె పేరు భాను ప్రియగా మారింది.
భాను ప్రియా మొట్ట మొదట తమిళ్ లో సినిమా చేసింది. ఆ తర్వాత 1984లో వచ్చిన సితార సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా రాణించిన భాను ప్రియా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో హీరో తల్లిగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం భానుప్రియ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గతంలో భానుప్రియ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా భర్త మరణం నన్ను బాగా కుంగదీసింది. ఆతర్వాత జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వల్ల డైలాగ్స్ గుర్తుండటంలేదు. అందువల్లే సినిమాలు మానేశా అని తెలిపారు భానుప్రియ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.