
చాలా మంది అందాల భామలు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయితే మరికొంతమంది మాత్రం క్రేజ్ తగ్గి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. కొంతమంది సహాయక పాత్రలు చేస్తున్నారు మరికొంతమంది మాత్రం.. అక్క, వదిన పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 2016వరకు సినిమాలు చేసిన ఆమె సడన్ గా సినిమాలనుంచి దూరం అయ్యింది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనుంది.
ఆమె ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలో ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ఒకప్పుడు కుర్రాళ్లను కవ్వించిన ఇషా చావ్లా.. ప్రేమ కావాలి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ఇషాచావ్లా. ప్రేమ కావాలి సినిమా హిట్ కావడంతో ఇషా చావ్లాకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో క్లిక్ అయ్యింది. దీంతో ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. మొత్తం ఐదు తెలుగు సినిమాలు.. ఒక కన్నడ సినిమాలో అలరించింది. అయితే ప్రేమ కావాలి తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాతో ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇస్తుంది. 2014 నుంచి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఇషా చావ్లా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది. 2016లో చివరిగా ఓ కన్నడ సినిమాలో నటించింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. కాగా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి