
మహేష్ నటించిన సినిమాల్లో ఖలేజా సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. అసలు ఖలేజా సినిమా ఎందుకు ఆడలేదు కూడా చాలా మందికి అర్ధం కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డైలాగ్స్, మహేష్ బాబు యాటిట్యూడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం కూడా అలరిస్తుంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో అనుష్క నటించింది. ఇక ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. మే 30 ఖలేజా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల రికార్డ్ ను బ్రేక్ చేసింది.
కాగా ఈ సినిమాలో కొంత భాగం రాజస్థాన్ లో జరుగుతుంది. టాక్సీ డ్రైవర్ అయినా హీరో.. తన కారుపై పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి రాజస్థాన్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా విలన్స్ హీరోమీద అటాక్ చేస్తారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ఓ గ్రామానికి హీరో చేరుకుంటాడు. అక్కడ హీరోని అందరూ దేవుడిగా కొలుస్తూ ఉంటారు.. అయితే ఈ సీన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఖలేజా సినిమాలో మహేష్ బాబు ఓ పాపను కాపాడే సీన్ ఉంటుంది.
ఆ సీన్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. ఈ సీన్ లో మహేష్ కాపాడిన పాప ఎవరో తెలుసా.? ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది.? ఎలా ఉందో తెలుసా.? ఆమె ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆని. ఈ చిన్నది అనుకోకుండా ఒక రోజు (2005) చిత్రంతో అరంగేట్రం చేసింది యాని. ఆమె స్టాలిన్ (2006), అతిది (2007), స్వాగతం (2008), ఏక్ నిరంజన్ (2009), రాజన్న (2011) వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. వీటితో పాటు ఖలేజా సినిమాలోనూ నటించింది. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.ఇప్పుడు చాలా అందంగా ఒక్క చూపుతో కుర్రాళ్ళను కట్టిపడేశాలా మారిపోయింది. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఈ చిన్నది తన క్యూట్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.