Rashmika Mandanna: రష్మికతో ఇంత క్లోజ్‌గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..? హృదయాలకు గాయం చేసే అందాల తార..
. కొన్ని రోజులుగా ఈ చిత్రాలన్ని వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రష్మికకు సంబంధించిన ఓ రేర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ పిక్ చూస్తుంటే కథానాయికగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో దిగిన ఫోటో అని తెలుస్తోంది. అయితే అందులో నేషనల్ క్రష్ పక్కనే మరో అమ్మాయి కనిపిస్తుంది. వీరిద్దరు చాలాకాలంగా మంచి స్నేహితులు అని తెలుస్తోంది. రష్మిక పక్కనే ఉన్న యువతి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. పైన ఫోటోను చూశారు కదా..గుర్తుపట్టరా ?
కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ చిన్నది.. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తుంది. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే రెయిన్ బో, గర్ల్ ప్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. కొన్ని రోజులుగా ఈ చిత్రాలన్ని వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రష్మికకు సంబంధించిన ఓ రేర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ పిక్ చూస్తుంటే కథానాయికగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో దిగిన ఫోటో అని తెలుస్తోంది. అయితే అందులో నేషనల్ క్రష్ పక్కనే మరో అమ్మాయి కనిపిస్తుంది. వీరిద్దరు చాలాకాలంగా మంచి స్నేహితులు అని తెలుస్తోంది. రష్మిక పక్కనే ఉన్న యువతి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. పైన ఫోటోను చూశారు కదా..గుర్తుపట్టరా ? తను ఎవరంటే.. కన్నడ భామ ఆషికా రంగనాథ్. వీరిద్దరు ఇండస్ట్రీలో మంచి స్నేహితులు.
ఆషికా రంగనాథ్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచమయైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్తాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇందులో ఆషిక నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నట్లు తెలుగులో ఈ బ్యూటికీ ఎక్కువగా ఆఫర్స్ మాత్రం రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో నా సామిరంగ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇందులో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించారు.
ఆషిక రంగనాథ్.. 1996 ఆగస్ట్ 5న కర్ణాటకలోని తుమకూరులో జన్మించింది. కాలేజీ రోజుల్లోనే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో అడిషన్ ఇచ్చి 2014లో రన్నరప్ అయ్యింది. 2016లో క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మాస్ లీడర్, మొగులునాగే, రాజు కన్నడ మీడియం, రాంబో 2 చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తెలుగులో సినిమా ఆఫర్స్ అందుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.