అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు చాలా మంది. కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. మరికొంతమంది స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు.

అప్పుడు అంట్లు తోమింది.. కట్ చేస్తే నటిగా సూపర్ క్రేజ్.. రాజకీయాల్లోనూ తోపు ఈమె
Actress

Updated on: Feb 14, 2026 | 12:13 PM

ఎవరి ఫేట్ ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం.. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. జీరో నుంచి మొదలు పెట్టి స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా  వచ్చి ఇప్పుడు హీరోలుగా , హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలను చూసి. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్న వారు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. చాలా మంది కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు చూశారు. చిన్న చిన్న పనులు చేసిన వారు.. ఒక్కపూట తిండికోసం కష్టపడినా వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కూడా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంది. పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు చూసింది. ఒకప్పుడు హోటల్‌లో అంట్లు కడిగింది. కట్ చేస్తే సినిమాల్లోకి అడుగు పెట్టింది.

అప్పట్లో ఊపేసింది..! 90’s కిడ్స్ ఫేవరెట్ యాంకర్.. ఈ అమ్మడు గుర్తుందా.?

పైన కనిపిస్తున్న ఆ నటి కెరీర్ బిగినింగ్ లో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. ఇక ఇప్పుడు తిరిగి సీరియల్స్ లో నటిస్తుంది ఆమె.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో కనిపిస్తున్న నటి మరెవరో కాదు స్మృతి ఇరానీ. ఢిల్లీలో ఒక పంజాబీ-బెంగాలీ కుటుంబంలో జన్మించింది స్మృతి ఇరానీ. మరియు రాజకీయాల్లోకి రాకముందు టెలివిజన్ రంగంలో విజయవంతమైన వృత్తిని కలిగి ఉంది, ముఖ్యంగా “క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ” సీరియల్‌లో తులసి విరాణీ పాత్ర ద్వారా ప్రసిద్ధి చెందింది.

ఇవి కూడా చదవండి

ఎదురు కట్నమైనా ఇస్తా..! అమ్మాయిలో అలాంటి క్వాలిటీస్ ఉండాలి : జబర్దస్త్ నరేష్

ఆమె గతంలో మోడలింగ్ చేసింది, టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా కూడా పనిచేసింది. కాగా జీవితంలో స్మృతి ఇరానీ ఎన్నో కష్టాలను చూసింది. చిన్న చిన్న పనులు చేసి ఆమె తన కుటుంబాన్ని పోషించింది. మొదట్లో కాస్మొటిక్స్‌ అమ్మింది. ఆ పనికి రూ. 200 జీతం అందుకుందట.. ఆ తర్వాత 20 ఏళ్ల వయసులో ఇండియాలోని మొట్టమొదటి మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లో పని చేరింది. అక్కడ గిన్నెలు కడిగే పని చేసిందట. ఆతర్వాత ఆమె సినిమా రంగం వైపు అడుగులేసింది. పలు ఆడిషన్స్ ఇచ్చింది. కొన్ని మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆతర్వాత సీరియల్స్ వైపు అడుగులేసింది. సీరియల్ లో స్టార్ గా ఎదిగింది స్మృతి ఇరానీ. రామాయణం అనే టీవీ సీరియల్‌లో సీతగా కూడా నటించింది. ఇక సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న ఆమె రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. 2003లో బీజేపీలో జాయిన్ అయ్యారు. మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీ ఇప్పుడు తిరిగి సీరియల్స్ లో నటిస్తున్నారు స్మృతి ఇరానీ.

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి