చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్..12 సినిమాలు చేస్తే నాలుగే హిట్లు
సినిమాల్లో హీరోయిన్స్ గా రాణిస్తున్న చాలా మంది.. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగానో సైడ్ ఆర్టిస్ట్ లుగానో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే.. ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. పైన కనిపిస్తున్న నటి కూడా అంతే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి ఆతర్వాత హీరోయిన్ గా మారింది.

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది ఈ పోటీని తట్టుకలోలేక ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలాగే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా, సైడ్ యాక్టర్స్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత మెయిన్ హీరోలుగా , హీరోయిన్స్ గా చేస్తూ ఉంటారు. కాగా పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ అమ్మడు దాదాపు 12 సినిమాలు హీరోయిన్ గా చేస్తే కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అయినా కూడా అవకాశాలకు మాత్రం కొదవలేదు.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది ఈ చిన్నది.. అయినా లాభం లేకుండా పోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
చాలా మంది హీరోయిన్ తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు.. అలాగే ఈ అమ్మడు కూడా.. ఇంతకూ ఆమె ఎవరంటే.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రీతూ వర్మ. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది రీతూ వర్మ. ఆ సినిమాలో కాజల్ చెల్లిగా నటించింది. ఆతర్వాత ఈ చిన్నది హీరోయిన్ గా మారింది ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.
ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆసినిమా తర్వాత రీతూకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తమిళ్ లోనూ సినిమాలు చేసింది. కానీ ఈ బ్యూటీకి ఎక్కువగా హిట్స్ రాలేదు. దాదాపు 12 సినిమాలు చేస్తే కేవలం నాలుగు సినిమాలే హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన మజాకా సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ ఈమధ్య గ్లామర్ షోతో కేక పెట్టిస్తుంది.
View this post on Instagram
రీతూ వర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
