ప్రభాస్‌కు కోడలిగా, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా చేసిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. వరుసగా రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్.

ప్రభాస్‌కు కోడలిగా, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా చేసిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Prabhas, Pawan Kalyan

Updated on: May 05, 2025 | 7:59 PM

ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మతిపోతుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్. ఈ చిత్రం ఒక రొమాంటిక్ హారర్ డ్రామాగా రూపొందుతోంది. ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదలకానుందని టాక్. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హనూ రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం 1943 నాటి స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో రూపొందుతోందని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. రజాకార్ల నేపథ్యంలో భారీ యాక్షన్ మరియు ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుందని టాక్.

అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2లో నటిస్తున్నాడు ప్రభాస్. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని అంటున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలతో పాటు , రాజకీయాలతో బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో రాణిస్తూనే సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.? ప్రభాస్ కు కోడలిగా.. పవన్ కళ్యాణ్ కు లవర్ గా నటించింది ఆమె.. ఆ బ్యూటీ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. అవును తమన్నా ప్రభాస్ కు కోడలిగా నటించింది. బాహుబలి సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. పెద్ద ప్రభాస్ కు కోడలిగా.. చిన్న ప్రభాస్ లవర్ గా నటించింది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో పవన్ లవర్ గా కనిపించింది మిల్కీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.