Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడింది ఎవరో తెలుసా.? అద్భుతంగా ఆలపించారు
ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని తెలుపుతూ సాగిన ఈ పాటను మహాకవి అందె శ్రీ రచించారు. ఆస్కార్ విజేత కీరవాణి అద్భుతంగా స్వరాలు సమకూర్చారు. ఇప్పుడు తెలంగాణాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ పాట నిలిచి పోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఈ రాష్ట్ర గీతాన్ని ఆలపించిందో ఎవరో తెలుసా.?

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకల్లో నూతనంగా రూపొందించిన రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు సచివాలయంలో మంత్రులు, పార్టీ సీనియర్లతో సహా మిత్రపక్షాలతో సమావేశమైన సీఎం రేవంత్.. పలు సూచనలు స్వీకరించారు. రెండున్నర నిమిషాల నిడివితో ఒక వర్షన్, 10.40 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల గీతమే ఉపయోగిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి నేతృత్వంలో గాయనీగాయకులు పాడిన గీతం.. అందరినీ అలరించింది. అయితే, ఈ గీతంలో ముగ్దూం మోహిణుద్దీన్ పేరును జతచేయాలంటూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన సూచనకు సీఎం అంగీకరించారు. షేక్ బందగీ, కొమ్రం భీం పేర్లను కూడా గీతంలో పొందుపరిచారు.
ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని తెలుపుతూ సాగిన ఈ పాటను మహాకవి అందె శ్రీ రచించారు. ఆస్కార్ విజేత కీరవాణి అద్భుతంగా స్వరాలు సమకూర్చారు. ఇప్పుడు తెలంగాణాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ పాట నిలిచి పోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఈ రాష్ట్ర గీతాన్ని ఆలపించిందో ఎవరో తెలుసా.?
‘జయ జయహే తెలంగాణ’ అంటూ సాంగిన గేయాన్ని ఆలపించింది ఎవరో కాదు. నేపధ్యగాయకుడు రేవంత్, సింగర్ హారిక నారాయణ్. ఈ ఇద్దరూ తమ గాత్ర మాధుర్యంతో ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని అద్భుతంగా అలరించారు. ఈ పాట విడుదలకు ముందు ఈ ఇద్దరు సింగర్స్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ లు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని పాడటం అనేది చరిత్రలో నిలిచిపోయే అంశమని. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో నన్ను చేర్చుకున్నందుకు అందె శ్రీ గారికి, కీరవాణి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు అంటూ హారికా నారాయణ రాసుకొచ్చారు. మా కొత్త రాష్ట్రీయ గీతం “జయ జయ హే తెలంగాణ” లో నేను పలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కీరవాణి గారికి చాలా ధన్యవాదాలు. మీ మ్యూజికల్ ఇన్‌పుట్‌లతో ఈ పాట పాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను జీవన్ గారు ప్రోగ్రాం చేసారు అలాగే మహాకవి అందెశ్రీ గారు సాహిత్యం అందించారు. ఈ పాటను ఇతర అద్భుతమైన గాయకులతో పంచుకోవడం సంతోషంగా ఉంది. దయచేసి ఈ పాట విని నన్ను ఆశీర్వదించండి అని రేవంత్ రాసుకొచ్చాడు.
View this post on Instagram
రేవంత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..