Aadikeshava: జస్ట్ మిస్.. లేదంటే ఎఫెక్ట్ పడేదే.. ‘ఆదికేశవ’ సినిమాను ఆ హీరో రిజెక్ట్ చేశాడా ?.

ఇక ఆ తర్వాత వైష్ణవ్ నటించిన ఏ సినిమా థియేటర్లలో విజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆదికేశవ సైతం మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఊర మాస్ యాక్షన్‏తో నటనపరంగా వైష్ణవ్ మెప్పించినా అనుకున్నంతగా మాత్రం సక్సెస్ కాలేదు. ఇందులో వైష్ణవ్ జోడిగా శ్రీలీల నటించింది. ఇందులో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో బోయపాటి స్కంద, వినయ విదేయ రామ సినిమాలతో పోలుస్తున్నారు.

Aadikeshava: జస్ట్ మిస్.. లేదంటే ఎఫెక్ట్ పడేదే.. ఆదికేశవ సినిమాను ఆ హీరో రిజెక్ట్ చేశాడా ?.
Aadikeshava

Updated on: Nov 26, 2023 | 12:16 PM

ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. కానీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతున్నాడు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమా మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇక ఆ తర్వాత వైష్ణవ్ నటించిన ఏ సినిమా థియేటర్లలో విజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆదికేశవ సైతం మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఊర మాస్ యాక్షన్‏తో నటనపరంగా వైష్ణవ్ మెప్పించినా అనుకున్నంతగా మాత్రం సక్సెస్ కాలేదు. ఇందులో వైష్ణవ్ జోడిగా శ్రీలీల నటించింది. ఇందులో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో బోయపాటి స్కంద, వినయ విదేయ రామ సినిమాలతో పోలుస్తున్నారు. జూనియర్ బోయపాటి దొరికేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా వైష్ణవ్ ఖాతాలో మరో డిజాస్టర్ వచ్చి చేరింది.

అయితే ఈ సినిమాలో వైష్ణవ్ నటనకు.. శ్రీలీల పెర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. నిజానికి ఈ సినిమా వైష్ణవ్ చేయాల్సింది కాదట. ఈ మూవీ స్టోరీని ఓ హీరోను దృష్టిలో పెట్టుకొని రాశాడట శ్రీకాంత్. కానీ అనుకోకుండా వైష్ణవ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇంతకీ ఆదికేశవ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరో ఎవరనుకుంటున్నారా ?.. అతను మెగా హీరో వరుణ్ తేజ్. ముందుగా ఈ స్టోరీని వరుణ్ కు చెప్పాడట శ్రీకాంత్. కానీ అప్పటికే వరుసగా మూవీస్ ఒప్పుకోవడంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడని.. దీంతో ఈ స్టోరీ వైష్ణవ్ వద్దకు వెళ్లిందట. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు.

అయితే కొన్నాళ్లుగా వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంటున్న వరుణ్.. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం వల్ల మరో డిజాస్టర్ నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. అయితే కేవలం కోట బొమ్మాళి సినిమా మినహా ఆదికేశవ సినిమాకు మరో చిత్రం పోటీలేదు. దీంతో ఈ మూవీకి ఈవీకెండ్స్ మరిన్ని వసూళ్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.