సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకున్న ఈ స్టార్ హీరోయిన్ చిరంజీవితో కలిసి నటిస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా

ఒకప్పుడు అంటే మన హీరోయిన్లు ఒక ఇండస్ట్రీలోనే గిరిగీసుకుని కూర్చునేవారు.. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్థాయి పెరిగిపోయింది. మన ఇండస్ట్రీ బౌండరీలు కూడా ప్యాన్ ఇండియా దాటేశాయి. దీంతోనే చాలామంది నటీమణులు.. ఒక ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు పడవలపైనా ప్రయాణం చేస్తూ..

సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకున్న ఈ స్టార్ హీరోయిన్ చిరంజీవితో కలిసి నటిస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా
Tollywood
Follow us

|

Updated on: Aug 03, 2024 | 7:18 PM

ఒకప్పుడు అంటే మన హీరోయిన్లు ఒక ఇండస్ట్రీలోనే గిరిగీసుకుని కూర్చునేవారు.. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్థాయి పెరిగిపోయింది. మన ఇండస్ట్రీ బౌండరీలు కూడా ప్యాన్ ఇండియా దాటేశాయి. దీంతోనే చాలామంది నటీమణులు.. ఒక ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు పడవలపైనా ప్రయాణం చేస్తూ.. చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అయిపోతున్నారు. పైన పేర్కొన్న ఫోటోలోని అమ్మాయిని చూశారా.? ఆమె ఒక స్టార్ హీరోయిన్. ఒక్క ఇండస్ట్రీ కాదు.. ఏకంగా మూడు ఇండస్ట్రీలలో చక్రం తిప్పుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్దికాలంలోనే యంగ్ హీరోలతోనే కాదు.. స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది. మన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫ్రెండ్ ఈ బ్యూటీ. కన్నడ కస్తూరిగానే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఆమెవరో గుర్తుపట్టారా.?

ఆమె మరెవరో కాదు అషికా రంగనాధ్. కర్ణాటకలోని తుమకూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. బుల్లితెర నుంచి తన కెరీర్ నుంచి ప్రారంభించింది. పలు డ్యాన్స్ షోలలో పాల్గొని.. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌‌గా నిలిచింది. ఈమె అక్క అనూష రంగనాథ్ కూడా కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ‘క్రేజీ బాయ్’ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్.. ‘రాంబో2’ మూవీతో తన తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ‘మదగజ’, ‘అవతార పురుష’, ‘గరుడ’ లాంటి చిత్రాలతో అషికా రంగనాధ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు స్టార్ హీరోల సినిమాల్లోనూ క్యామియో రోల్స్‌లో అలరించింది ఈ అందాల భామ.

మరోవైపు ‘పట్టాత్తు ఆర్సన్’ అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా.. గత ఏడాది తెలుగు ప్రేక్షకులను ‘అమిగోస్’ చిత్రంతో పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించకపోయినా.. అషికా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ‘నా సామి రంగా’ చిత్రంలో నాగార్జున సరసన యాక్ట్ చేసి.. పల్లెటూరి అమ్మాయిలా అందరినీ అలరించింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘విశ్వంభర’లో నటిస్తోంది. అటు కన్నడం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అషికా.

సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకున్న ఈమె.. ఇప్పుడొక స్టార్ హీరోయిన్!
సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకున్న ఈమె.. ఇప్పుడొక స్టార్ హీరోయిన్!
గొప్ప మనసు చాటుకున్న కేఎల్ రాహుల్- అతియా.. పిల్లల కోసం..
గొప్ప మనసు చాటుకున్న కేఎల్ రాహుల్- అతియా.. పిల్లల కోసం..
ఈ సూపర్ ఫుడ్స్ హార్ట్ బ్లాక్‌ను నివారించడంలో అద్భుతంగాపనిచేస్తాయి
ఈ సూపర్ ఫుడ్స్ హార్ట్ బ్లాక్‌ను నివారించడంలో అద్భుతంగాపనిచేస్తాయి
త్వరలో భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటో తెలుసా..?
త్వరలో భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటో తెలుసా..?
తాజా మాజీలను వెంటాడుతున్న పాత జ్ఞాపకాలు..!
తాజా మాజీలను వెంటాడుతున్న పాత జ్ఞాపకాలు..!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
'నా బిడ్డను చంపేశారు'.. గుండెలవిసేలా రోదిస్తోన్న గీతూ రాయల్
'నా బిడ్డను చంపేశారు'.. గుండెలవిసేలా రోదిస్తోన్న గీతూ రాయల్
మునక్కాయ చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే.. ఆహా అనాల్సిందే!
మునక్కాయ చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే.. ఆహా అనాల్సిందే!
ప్రపంచంలో అత్యంత అందమైన ఏనుగు ఇదే..!హెయిర్‌స్టైల్‌కిఫ్యాన్స్ ఫిదా
ప్రపంచంలో అత్యంత అందమైన ఏనుగు ఇదే..!హెయిర్‌స్టైల్‌కిఫ్యాన్స్ ఫిదా
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!