Kantara: వరాహా రూపం సాంగ్ పాడిన సింగర్ ఎవరో తెలుసా.. ఆమె మన తెలుగమ్మాయే..

|

Dec 04, 2022 | 6:36 PM

కాంతార సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా ముందుగా కన్నడలో రిలీజ్ అయ్యింది.

Kantara: వరాహా రూపం సాంగ్ పాడిన సింగర్ ఎవరో తెలుసా.. ఆమె మన  తెలుగమ్మాయే..
kanthara
Follow us on

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు కాంతార. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది ఈ సినిమా. కాంతార సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా ముందుగా కన్నడలో రిలీజ్ అయ్యింది. అక్కడ సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత పలు భాషల్లో రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీన అక్కడ విడుదలైన ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చినా థియేటర్లలో ఉండటం విశేషం. ఈ సినిమాను తెలుగులో బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 15వ తేదీన ఇక్కడ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచి చాలా రోజుల పాటు అదే వసూళ్ల జోరును కొనసాగించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో వరాహా రూపం సాంగ్ పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ సాంగ్ ప్లేస్ లో మరో ట్యూన్ తో వరాహా రూపం సాంగ్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటను పాడిన సింగర్ ఎవరు అంటూ అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఈ పాట పడింది ఎవరో కాదు..సింగర్ శ్రీ లత.

తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటేషన్స్ లలో తన ప్రతిభను చాటింది సింగర్ శ్రీలలిత. బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వరనీరాజనం, సరిగమప లిటిల్ ఛాంప్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి

Singer Srilatha