
అఖండ హిట్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించగా..ఆయనకు జోడిగా శ్రీలీల కథానాయికగా అలరించింది. బోయపాటి శ్రీను, రామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మాస్ అడియన్స్ ను ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇందులోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రామ్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. రెండు రోజుల్లోనే మొత్తం రూ.12.11 కోట్లు షేర్ లభించింది. అటు ఈ వారాంతంలోని శని, ఆదితోపాటు సోమవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో మరింత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఓ కొత్తందం తెరపై సందడి చేసింది. ఈ మూవీలో రామ్ పోతినేని చెల్లిగా ఓ అమ్మాయి కనిపించింది. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ఆమె కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అమృత చౌదరి. పక్కా తెలుగమ్మాయి. భీమవరంలో జన్మించిన అమృతా.. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కాలేజీ డేస్ లోనే యాక్టింగ్ తన టాలెంట్ చూపించింది. ఆ తర్వాత ఇన్ స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఇక పలు షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్ లో యాక్ట్ చేసింది. దీంతో అటు సినిమా ట్రయాల్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్కంద చిత్రంలో హీరోకు చెల్లిగా నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఇక ఈ బ్యూటీకి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమంటున్నారు నెటిజన్స్. నిత్యం ఫోటోస్, వీడియోస్, రీల్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది అమృతా చౌదరి. ఇదిలా ఉంటే.. నిన్న విడుదల చేసిన స్కంద మేకింగ్ వీడియో ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.