
చిన్న సినిమాలు ఇప్పుడు అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. కంటెంట్ ను నమ్ముకున్న సినిమాలు చాలా పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంటున్న సినిమాలు కలెక్షన్స్ పరంగానూ దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఓ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. ఓ రేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఈ సినిమా 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ మంచి విజయంతో దూసుకుపోతుంది.
ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు ‘బాలన్: ది బాయ్’. చాలా మంది ఈ సినిమా గురించే చెప్తున్నారు. ఈ సినిమా మలయాళంలో తెరకెక్కింది. ‘జాన్ ఎ మ్యాన్’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సెప్టెంబర్ 19న బాలన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు ఏకంగా రూ. 1.82 కోట్ల నెట్ కలెక్షన్ల సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో రోజు రోజుకు కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. సినిమా విడుదలై ఎనిమిది రోజులకు ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల గ్రాస్ సాధించింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దాంతో ఈ సినిమా చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి