
ఇప్పుడంటే వారం, పదిరోజులకు సినిమా బ్లాక్ బస్టర్, బంపర్ హిట్ అని పోస్టర్స్ వేసుకుంటున్నారు కానీ అప్పట్లో సినిమా అంటే 50 రోజులు ఆడితే అది యావరేజ్ , వందరోజులు ఆడితే అది హిట్.. వందరోజులు దాటిందంటే అది బంపర్ హిట్. ఒకప్పుడు సినిమాల క్రేజ్ కూడా అలానే ఉండేది. ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని నెలరోజులలోపే సినిమాలు థియేటర్స్ నుంచి తీసేస్తున్నారు. అలాగే అప్పట్లో హీరోలు ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేసేవారు. ఇప్పుడు రెండు మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు. ఇవ్వన్నీ పక్కన పెడితే.. ఓ హీరో సినిమా 29 రోజులలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ఏకంగా 500 రోజులకు పైగా థియేటర్స్ లో ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. యావరేజ్ టాక్ తో మొదలైన ఆ సినిమా 512 రోజులు అడిందంటే మాములు విషయం కాదు. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..
తెలుగు సినిమా చరిత్ర పై చెరిగిపోని సంతకం చేసిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా ఈ సంక్రాంతికి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. మాస్.. యాక్షన్ చిత్రాలే కాదు.. కామెడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ చిరు స్టైల్ ప్రత్యేకం. అలాగే ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు చిరు. అయితే ఆయన కెరీర్ ఆరంభంలో తెరకెక్కించిన ఓ సినిమా అప్పట్లే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 1982లో మెగాస్టార్ చిరంజీవి.. మాధవి జంటగా నటించిన చిత్రం ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 1982 ఏప్రిల్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
ఏకంగా 512 రోజులు ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో చిరు ఇమేజ్ కొత్తగా చూపించడమే కాకుండా.. కేవలం 29 రోజులలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. యావరేజ్ టాక్ తో జర్నీ స్టార్ట్ చేసింది. కానీ మెల్లగా కలెక్షన్స్ వర్షం కురిపించింది. కేవలం 3 లక్షల 25 వేల రూపాయాలతో సినిమాను నిర్మించారట. అయితే సెన్సార్ సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయట. ఆ తర్వాత విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఎనిమిది కేంద్రాలలో 50 రోజులు.. రెండు కేంద్రాలలో వందరోజులు ఆడి భారీగా వసూళ్లు రాబట్టింది. అలాగే హైదరాబాద్ నగరంలో ఏకంగా 512 రోజులు ఆడి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. అది మెగాస్టార్ క్రేజ్ అంటే..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..