ఇదెక్కడి సినిమారా బాబు.! 19 ఏళ్ల తర్వాత రిలీజ్..15 మంది స్టార్స్..! మూవీ రిలీజ్ అయ్యిందని హీరోకు కూడా తెలియదంట..

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నా కూడా విడుదలకు మాత్రం నోచుకోవు. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఆగిపోతుంటాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకున్న కూడా విడుదల కావు.

ఇదెక్కడి సినిమారా బాబు.! 19 ఏళ్ల తర్వాత రిలీజ్..15 మంది స్టార్స్..! మూవీ రిలీజ్ అయ్యిందని హీరోకు కూడా తెలియదంట..
Movie

Updated on: Jan 31, 2026 | 11:11 AM

కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటీ విడుదలకు మాత్రం నోచుకోవు.. చాలా చిన్న సినిమాలు విడుదల కాకుండా ల్యాబ్స్ లోనే ఆగిపోతుంటాయి. అలాగే పెద్ద హీరోల సినిమాలు కూడా కొన్ని సార్లు అనుకోని కారణాల వల్ల థియేటర్స్ లోకి రావు. కొన్ని సినిమాలు స్టార్టింగ్ లోనే ఆగిపోతే.. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని ఆగిపోతుంటాయి. అలానే ఓ పెద్ద హీరో సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.. ఫైనల్ గా సినిమాను ఎదో ఒకటి చేసి విడుదల చేశారు.. కానీ ఆ సినిమా విడుదలైందని కనీసం హీరోకు కూడా తెలియదంట. అలాగే ఈ సినిమాలో ఏకంగా 14మంది స్టార్ హీరోలు కనిపించారు. పెద్ద హీరో, హీరోయిన్ ఉన్నప్పటికీ ఆ సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఆలస్యం అంటే అంతా ఇంతా కాదు ఏకంగా 19 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి మోక్షం లభించింది.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు.. 

ఆ సినిమా మరేదో కాదు కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన రక్త కాశ్మీర. ఈ సినిమాకు ఓ సపరేట్ రికార్డ్ ఉంది.ఎందుకంటే 2007లో షూటింగ్ మొదలై, దాదాపు 19 సంవత్సరాల తర్వాత జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇంతకాలం విడుదలకు నోచుకోలేని ఈ సినిమా ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకు వచ్చింది. ఈ సినిమాలో హీరోగా ఉపేంద్ర నటించారు. అలాగే హీరోయిన్ గా రమ్య నటించారు.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

సినిమా కథ విషయానికొస్తే.. బెంగళూరులో ఒక స్టంట్ ట్రైనర్ (ఉపేంద్ర) అనాథల కోసం స్టంట్ ట్రైనింగ్ స్కూల్ నడుపుతాడు. వాళ్లను తన పిల్లల్లా చూసుకుంటాడు. అతని జీవితంలో ఓ అమ్మాయి (రమ్య) రావడంతో సంతోషం పెరుగుతుంది. కానీ ఒక రోజు ఆ అనాథ పిల్లలు టెర్రరిస్టుల బాంబు పేలుడు ప్లాన్ గురించి తెలుసుకుంటారు. దాంతో టెర్రరిస్టులు పిల్లలను అపహరించి కాశ్మీర్కి తీసుకెళ్తారు. హీరో, హీరోయిన్ కలిసి ఆ పిల్లలను రక్షించడానికి రిస్క్ తీసుకుని మిషన్ చేస్తారు. ఇంతకూ ఆ పిల్లలను హీరోఎలా కాపాడాడు అనేది సినిమాలో చూడాలి. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఒక పాటలో ఏకంగా 15 మంది హీరోలు కనిపిస్తారు. పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, దర్శన్, యష్, శివరాజ్ కుమార్ ఇలా చాలా మంది కనిపించారు. ఈసాంగ్ ఏకంగా 18 నిమిషాలు ఉంటుందట.. అయితే ఈ సినిమా విడుదలైందని హీరో ఉపేంద్రకు తెలియదు అంటూ కన్నడ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..