Posani: పోసాని ఇంటి పేరుతో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరో ఎవరో తెలుసా? మహేశ్ బాబుకు చాలా దగ్గరి చుట్టం కూడా..

నిన్నటి నుంచి పోసాని కృష్ణ మురళి పేరు వార్తల్లో తెగ వినిపిస్తోంది. గతంలో పోసాని చంద్రబాబు, పవన్ పై, వాళ్ళ ఫ్యామిలీలపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం (ఫిబ్రవరి 26) రాత్రి పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ నటుడి పేరు టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతోంది.

Posani: పోసాని ఇంటి పేరుతో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరో ఎవరో తెలుసా? మహేశ్ బాబుకు చాలా దగ్గరి చుట్టం కూడా..
Tollywood Actor

Updated on: Feb 27, 2025 | 5:22 PM

నటుడిగా, రచయితగా, దర్శకుడిగా..ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పోసాని కృష్ణ మురళి. అయితే గతంలో ఆయన మాజీ సీఎం జగన్, వైఎస్సార్ సీపీ పార్టీకి మద్దతుదారుడిగా కొనసాగారు. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేసాడు. దీంతో ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం (ఫిబ్రవరి 26) రాత్రి పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని పోసాని నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని రాయచోటికి తీసుకెళ్లారు. దీంతో గత కొన్ని గంటలుగా పోసాని పేరు బాగా మార్మోగిపోతోంది.

ఇదిలా ఉంటే పోసాని ఇంటి పేరుతో టాలీవుడ్ లో ఓ హీరో ఉన్నాడు. అయితే అతనికి పోసాని కృష్ణ మురళికి ఎలాంటి బంధుత్వం లేదు. దగ్గరి చుట్టరికం కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? అతను మరెవరో కాదు నవ దళపతి సుధీర్ బాబు. అవును ఈ హీరో పూర్తి పేరు పోసాని నాగ సుధీర్ బాబు. అయితే సింపుల్ గా అందరూ సుధీర్ బాబు అని పిలుస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మహేష్ ఫ్యామిలీతో సుధీర్ బాబు.. వీడియో..

సుధీర్ బాబు గతంలో స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. పుల్లెల గోపీచంద్ తో కలిసి మ్యాచ్ లు కూడా ఆడాడు. ఇక శివ మనసులో శృతి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రేమ కథ చిత్రం, భలే మంచి రోజు, శమంతకమణి, సమ్మోహనం, వి, శ్రీదేవి సోడా సెంటర్, హంట్, మామా మశ్చీంద్ర, హరోం హరా, మానాన్న సూపర్ హీరో తదితర హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం జటాధరా అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. కాగా సుధీర్ బాబు మహేష్ బాబుకు బావ అవుతాడు. మహేష్ చెల్లెలు ప్రియదర్శినిని సుధీర్ వివాహం చేసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.