Actress : ఐశ్వర్య రాయ్ అందానికే ఛాలెంజ్ చేసింది.. కట్ చేస్తే.. హిమాలయాల్లో ఒంటరిగా.. ఈ హీరోయిన్ ఎవరంటే..

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత అందమైన హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినీరంగాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసింది. ఇప్పుడు ఒంటరిగా హిమాలయాల్లో జీవిస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా.. ?

Actress : ఐశ్వర్య రాయ్ అందానికే ఛాలెంజ్ చేసింది.. కట్ చేస్తే.. హిమాలయాల్లో ఒంటరిగా.. ఈ హీరోయిన్ ఎవరంటే..
Barkha Madan

Updated on: Nov 16, 2025 | 3:06 PM

సాధారణంగా సినీరంగంలో నటిగా కొనసాగాలంటే అందం, అభినయంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. కానీ మీకు తెలుసా.. ఈ గ్లామర్ ప్రపంచంలో నటీనటులుగా ఓ వెలుగు వెలిగిన తారలు అనుహ్యంగా విభిన్న దారులను ఎంచుకున్నారు. ఒకప్పుడు అందంతోపాటు అద్భుతమైన నటనతో కట్టిపడేసిన ఓ హీరోయిన్.. ఇప్పుడు సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఒకప్పుడు రెడ్ కార్పెట్ మీద నడిచిన ఈ నటి, ఇప్పుడు సంయమనం, నిశ్శబ్దం , అంతర్గత శాంతితో నిండిన జీవితాన్ని గడుపుతుంది. ఆమె జీవితం తేలిగ్గా కనిపించినప్పటికీ ఎవరు అనుసరించలేరు. ఆమె పేరు బర్ఖా మదన్.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

ఒకప్పుడు మిస్ ఇండియా వేదికలో సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ వంటి వారితో ర్యాంప్ గ్లామర్‌లో నడిచిన అమ్మాయి ఇప్పుడు పర్వతాలలో ధ్యాన జీవితాన్ని గడుపుతోంది. గ్లామర్ ప్రపంచాన్ని విడిచిపెట్టి అంతర్గత శాంతి మార్గాన్ని ఎంచుకుంది. 1994లో, ఆమె మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అందులో ‘మిస్ టూరిజం ఇండియా’ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత మలేషియాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీలో మూడవ స్థానాన్ని పొందింది. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

1996లో సూపర్ హిట్ అయిన “ఖిలాడియోం కా ఖిలాడి”తో వెండితెరకు పరిచయమైంది. ఇందులో అక్షయ్ కుమార్, రేఖ, రవీనా టాండన్‌లతో కలిసి నటించింది. 2003లో, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన భూత్ చిత్రంలో మంజీత్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

Follow Us