
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. కానీ తెలుగులో చేసింది రెండు సినిమాలే. అయినప్పటికీ టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో స్టార్ హీరోయిన్స్ ను వెనక్కు నెట్టేసింది. కట్ చేస్తే.. వరుస అవకాశాలతో బిజీగా మారాల్సిన ఈ ముద్దుగుమ్మ కనిపించకుండాపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..తనే సోనాల్ చౌహన్. 1987లో న్యూఢీల్లీలో జన్మించిన సోనాల్.. హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. హిందీలో వరుస సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని రాజపుత్ర కుటుంబానికి చెందిన సోనాల్.. 2005లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెలిచింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
2008లో జన్నత్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది దక్షిణాదిలోకి అడుగుపెట్టింది. తెలుగుతోపాటు హిందీలోనూ నటించినా సోనాల్ అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఊహించిన స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయింది. తెలుగులో బాలయ్యతో ఏకంగా మూడు సినిమాల్లో నటించింది. తెలుగులో రెయిన్ బో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. లెజెండ్, షేర్, రూలర్, డిక్టేటర్, ది ఘోస్ట్, ఎఫ్ 2 వంటి చిత్రాల్లో టించింది. అయితే ఇందులో లెజెండ్, ఎఫ్ 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో సోనాల్ కు మంచి గుర్తింపు వచ్చింది.
కానీ ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ మాత్రం రాలేదు. కొన్నాళ్లు సైలెంట్ అయిన సోనాల్.. సమఝో నా కుచ్ తో సమఝో, బద్తమీజ్, కుచ్ నహీ వంటి మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. గ్లామర్ పరంగా మెప్పించినా సోనాల్ కు సరైన ఆఫర్స్ రాలేదు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సోనాల్.. ఇటీవల ఐపీఎల్ క్రికెట్ స్టేడియంలో సందడి చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ ఫోటోలతో సందడి చేస్తుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..