Tollywood : రెండు రాజ కుటుంబాల్లో వారసురాలు.. సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు అవకాశాల్లేక..

రెండు రాజ కుటుంబాల్లో ఆమె వారసురాలు. నవాబులకు మనవరాలు. అయినప్పటికీ నటనపై ఆసక్తితో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందమైన పాత్రలకు తెరపై తన నటనతో ప్రాణం పోసింది. ఇంతకీ ఆమె ఎవరంటే.

Tollywood : రెండు రాజ కుటుంబాల్లో వారసురాలు.. సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు అవకాశాల్లేక..
Aditi Rao Hydari

Updated on: Nov 01, 2025 | 1:24 PM

గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ముద్దుగుమ్మ మాత్రం ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసింది. రాజరికపు అందానికి ప్రత్యేకంగా నిలుస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండు రాజ వంశాలలో ఆమె వారసురాలు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ , టాలీవుడ్ రెండింటిలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. అదితి రావు హైదరీ. 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించిన అదితి.. ముత్తాత మొహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరి. ఆయన అస్సాం మాజీ గవర్నర్ గా పనిచేశారు. ఆమె తల్లి తరపు తండ్రి జె. రామేశ్వర్ రావు ఒకప్పుడు తెలంగాణలోని వనపర్తి ప్రాంతాన్ని పరిపాలించారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

ఆమె తల్లి విద్యారావు హిందూ శాస్త్రీయ గాయని.. తండ్రి ఎహ్సాన్ హైదరి ముస్లిం. అందుకే అదితి తన రెండు కుటుంబాల ఇంటి పేరును తన పేరుతో కలుపుతుంది. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. ప్రజాపతి అనే సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2009లో ఢిల్లీ-6తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో వరుస అవకాశాలు అందుకుంది. మర్డర్ 3, ఫితూర్ వంటి చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. 2011లో యే సాలీ జిందగీ , రాక్‌స్టార్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2018లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్ చిత్రంతో ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది.

ఇవి కూడా చదవండి :  Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..

అదితికి తెలుగు కంటే ఎక్కువగా తమిళం, మలయాళం, హిందీ భాషలలోనే అవకాశాలు వచ్చాయి. అదితి మొదట 24 సంవత్సరాల వయసులో నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో మహా సముద్రం సినిమా చిత్రీకరణ సమయంలో హీరో సిద్ధార్థ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు 2024లో తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ అదితికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..