AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dragon Movie: బ్యాడ్ లక్ అంటే ఇతనిదే.. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'డ్రాగన్'. తారక్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రి ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సుమారు 4 నిమిషాలకు పైగా నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Dragon Movie: బ్యాడ్ లక్ అంటే ఇతనిదే.. ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Dragon Movie
Basha Shek
|

Updated on: May 20, 2026 | 6:28 PM

Share

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న మేకర్స్ విడుదల చేసిన ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో కి సోషల్ మీడియా లో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సుమారు 4 నిమిషాలకు పైగా రన్ టైమ్ తో ఉన్న ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, చెప్పిన డైలాగులు అభిమానులకు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు. ఈ గ్లింప్స్ తోనే దాదాపు డ్రాగన్ మూవీ స్టోరీ చెప్పేశారు ప్రశాంత్ నీల్. ఒపియమ్ అనే మొక్క, దీని ద్వారా వచ్చే హెరాయిన్.. దీని చుట్టూ ఉండే మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. దీనికి తోడు ఇందులో ఏకంగా ఎనిమిది విలన్స్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ డ్రాగన్ లో నటించనున్నారు. అశుతోష్ రాణా, అనిల్ కపూర్, బిజు మేనన్, అన్షుమాన్ పుష్కర్, సిద్ధాంత్ గుప్తా, గురు సోమసుందరం, బిమల్ జీత్ ఒబెరాయ్, రష్యన్ నటుడు అలెగ్జాండర్ విజేవ్, బ్రిటిష్ నటుడు బెన్డిక్ట్ గారెట్, సౌతాఫ్రికా యాక్టర్ తుతేలో ప్రిన్స్ గ్రాట్ బూమ్ ఇలా దేశ, విదేశాలకు చెందిన నటీనటులు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు.

ఇక డ్రాగన్ మూవీలో కాంతారా బ్యూటీ రుక్మీణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మన తెలుగు వారందరికీ బాగా పరిచయమైన మలయాళం స్టార్ హీరో టొవినో థామస్ కూడా నటించాల్సి ఉంది. అయితే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ సినిమాను వదులుకున్నాడు. కొన్ని రోజుల క్రితం టొవినే థామసే స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు. ‘సాధారణంగా మలయాళ సినిమాలు ఒకే షెడ్యూల్‌లో లేదా మూడు నెలల్లో పూర్తి అవుతాయి. కానీ తెలుగులో భారీ ప్రాజెక్టుల కోసం ఏడాది పొడవునా వేర్వేరు సమయాల్లో డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఆయా షెడ్యూల్స్ బట్టి. అది నాకు కష్టం అవుతోంది. నాకు ఓ సినిమా పూర్తి అయ్యాక మరో సినిమా చేయడం అలవాటు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేయడం ఇష్టం లేదు. ఒక సినిమా కోసమే ఏడాది పాటు సమయం కేటాయిస్తే… నా మలయాళ సినిమాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అక్కడ నా కమిట్‌మెంట్లను బ్రేక్ చేయడం ఇష్టం లేక ఎన్టీఆర్ – నీల్ సినిమా డ్రాగన్ ను వదులుకున్నా’ అని టొవినో చెప్పుకొచ్చాడు.

కాగా డ్రాగన్ సినిమాలో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో వాజిర్ అయిన బాబీ సర్కార్ పాత్రకు టోవినే థామస్ ను అడిగారని టాక్. అయితే అతను ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ గుప్తాను ఈ పాత్రకు తీసుకున్నారని సమాచారం. డ్రాగన్ సినిమాలో బాబీ సర్కార్, లూగెర్ (ఎన్టీఆర్) అన్నదమ్ములుగా కనిపించనున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

డ్రాగన్ మూవీ గ్లింప్స్ వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us