Tollywood: ఈ ఫొటోలోని పాప బాలయ్య సరసన హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవరో గుర్తుపట్టారా.?

స్టార్ హీరోల సినిమాల్లో బాలనటులుగా చేసి.. ఆ తర్వాతి కాలంలో హీరోయిన్స్‌ అయినవారు చాలామంది ఉన్నారు. ఇదిగో ఈ ఫోటోలోని పాప కూడా ఆ కోవకు చెందినదే. అంతేనా.. అదే బాలయ్య సరసన హీరోగా నటించి అలరించింది. తనెవరో మీరు చెప్పగలరా...

Tollywood: ఈ ఫొటోలోని పాప బాలయ్య సరసన హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవరో గుర్తుపట్టారా.?
Actors

Updated on: Sep 11, 2024 | 12:37 PM

కెరీర్‌లో ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నారు నందమూరి నటసింహం బాలయ్య. వరస విజయాలు దూసుకుపోతున్నారు. అటు ఓటీటీ హెస్ట్‌గానూ అలరిస్తున్నారు. ఇటు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. అటు బసవతరాకం ఇండో అమెరికన్ ఆస్పత్రి చైర్మన్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్ని బాలయ్యకు ఇప్పుడు క్షణం తీరకలేదు. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో ఓ ఫిల్మ్ చేస్తున్నారు బాలయ్య. ఇక బాలయ్య కెరీక్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ హిట్స్ ఉన్నాయి. 50 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఆయన ఎంతోమంది నటీనటులతో పని చేశారు. అయితే పై ఫోటోలో బాలయ్య పక్కన ఉన్న పాపను గుర్తుపట్టారా..? తను వెండితెరను ఏలిన హీరోయిన్. బాలయ్య సినిమాలో బాలనటిగా చేసింది. ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్‌గానూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

చాలా మంది హీరోయిన్స్.. స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ వేషాలు వేసి.. ఆ తర్వాత వారి పక్కనే హీరోయిన్‌గా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పై ఫొటోలో ఉన్న పాప.. కూడా బాలయ్యతో హీరోయిన్‌గా చేసింది. తను మరెవరో కాదండోయ్.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. అందాల ‘రాశి’. పైన ఫోటో బాల‌కృష్ణ‌ హీరోగా కోడి రామ‌కృష్ణ తెరకెక్కించిన బాలగోపాలుడు చిత్రంలోనిది. ఈ సినిమాలో రాశి చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. అలాగే ఈ ఫోటోలో బాలయ్యకు మరోవైపు ఉంది హీరో కళ్యాణ్ రామ్. తను కూడా  సినిమాలో నటించారు.

ఇక బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన కృష్ణ బాబు సినిమాలో హీరోయిన్ నటించింది రాశి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కాగా ప్రస్తుతం రాశికి సినిమాల్లో మంచి అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె సీరియల్స్‌లో లీడ్ రోల్స్ వేస్తున్నారు.

Balakrishna Rashi

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..