ఇదేందయ్యా ఇది..! మహేష్ సినిమాలో నటించిన ఈ బుడ్డోడు.. ఆ క్రేజీ హీరోనా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం సక్సెస్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా ఇది. అలాగే ఈ చిత్రానికి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు.

ఇదేందయ్యా ఇది..! మహేష్ సినిమాలో నటించిన ఈ బుడ్డోడు.. ఆ క్రేజీ హీరోనా.?
Nijam

Updated on: May 17, 2026 | 11:26 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమాను అంతా సులభంగా ఎవ్వరూ మర్చిపోరు మరిచిపోరు. ఈ సినిమా రిజెల్ట్ ఎలా ఉన్నా ఆ సినిమాలో మహేష్ బాబు నటన అందరిని ఆకట్టుకుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక్కడు లాంటి మాస్ హిట్ తర్వాత మహేష్ ఎంచుకున్న డిఫరెంట్ స్టోరీ ఇది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్,  హీరోయిన్ రాశి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నటనకు గాను మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా, తాళ్ళూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. అలాగే ఈ సినిమాను  ఒడియాలో అర్జునగా, బంగ్లాదేశ్‌లో టాప్ లీడర్‌గా రీమేక్ చేయబడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్టింగ్ లో చందమామ రావే.. అంటూ సాగే ఒక పాట వస్తుంది.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

టైటిల్ పడే సమయంలో వచ్చే ఈ పాటలో ఒక తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ముద్దులొలుకుతున్న ఆ బాబు ఇప్పుడు హీరో అయ్యాడు.  అంతే కాదు ఆ చిన్నారి మహేష్ కు చాలా కావాల్సిన వాడు. ఆ బుడతడు ఎవరో కాదు మహేష్ బాబు అన్న కొడుకు రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

నిజం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు జయకృష్ణ.. ఇక ఇప్పుడు హీరోగా మారిపోయాడు. ఈ కుర్రాడు చాలా స్మార్ట్ గా అచ్చం బాబాయ్ మహేష్ బాబులా ఉన్నాడు. త్వరలోనే తన తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమా.. శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆట్టుకున్నాయి. మరి జయ కృష్ణ హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్నారు మహేష్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us