Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా ప్రజా సేవలో బిజీ బిజీగా .. ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, శ్రీకాంత్, జగపతి బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. పలు సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడీ అందాల తార ప్రజా సేవలో బిజి బిజీగా ఉంటోంది.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా ప్రజా సేవలో బిజీ బిజీగా .. ఎవరో తెలుసా?
Tollywood Actress

Updated on: May 01, 2025 | 1:43 PM

గతంలో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అయిన వారిలో చాలామంది సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇంట్లోనే పిల్లలతోనే సమయం గడిపేస్తున్నారు. ఇంకొందరు మళ్లీ సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం రకరకాల వ్యాపారాలు చేస్తూ బిజిగా ఉంటున్నారు. కాగా గతంలో స్టార్ హీరోయిన్లు గా ఓ వెలుగు వెలిగిన వారిలో కొందరు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా సేవలో తలమునకలై ఉంటున్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కోల్ కతాకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లోనూ నటించింది. తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, శ్రీకాంత్, మోహన్ బాబు, జగపతి బాబు వంటి హీరోల సినిమాల్లో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే యాంకర్ గా అవతారమెత్తిన ఈ అందాల తార జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రమంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేసిన ఈ ముద్దుగుమ్మ సమీప ప్రత్యర్థిపై ఏకంగా 76,853 ఓట్ల మెజార్టీ సాధించారు. ఎంపీగా మొదటి సారిగా పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ప్రస్తుతం ప్రజా సేవలో తలమునకలై ఉన్న ఆ నటి మరెవరో కాదు రచనా బెనర్జీ. పేరు చెబితే చాలా మందికి గుర్తు రాకపోవచ్చు కానీ.. చిరంజీవి నటించిన బావ గారు బాగున్నారా సినిమాలో సెకెండ్ హీరోయిన్ అంటే ఇట్టే కళ్ల ముందు మెదులుతుంది.

తెలుగులో అభిషేకం, కన్యాదానం, పవిత్ర ప్రేమ, సుల్తాన్, రాయుడు, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో తదితర చిత్రాల్లో నటించింది రచనా బెనర్జీ. ఇక సినిమా కెరీర్ మంచి పీక్స్ గా ఉన్న సమయంలోనే 2007లో ప్రోబల్ బసును పెళ్లి చేసుకుందీ అందాల తార. వీరికి ఒక బాబు ఉన్నాడు. టాలీవుడ్ కు దూరంగా ఉన్న ఈ అందాల తారకు బెంగాలీలో మంచి పాపులారిటీ ఉంది. ఈ క్రమంలోనే గతేడాది రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

పార్లమెంట్ భవనం ముందు..

మమతా బెనర్జీని అమితంగా అభిమానించే రచన గతేడాది సార్వత్రి కెన్నికల్లో ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుగ్లీ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు.తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీపై 76,853 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు. ఇప్పుడు ఎంపీగా ప్రజా సేవలో బిజి బిజీగా ఉంటున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి