Actress : 9 సంవత్సరాలు భర్త చేతిలో నరకం.. విడాకుల తర్వాత ఇండస్ట్రీలో క్రేజ్.. 45 ఏళ్ల వయసులో తగ్గని డిమాండ్..

ప్రస్తుతం బుల్లితెర నటీనటులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోహీరోయిన్ల మాదిరిగానే స్మాల్ స్క్రీన్ తారలు సైతం తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ నటి.. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ నటన జీవితంలో మాత్రం మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : 9 సంవత్సరాలు భర్త చేతిలో నరకం.. విడాకుల తర్వాత ఇండస్ట్రీలో క్రేజ్.. 45 ఏళ్ల వయసులో తగ్గని డిమాండ్..
Shwetha Tiwari

Updated on: Nov 20, 2025 | 10:06 AM

బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అలాగే వ్యక్తిగత జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆమె.. ఇప్పుడు టీవీ ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న నటిగా మారింది. 45 ఏళ్ల వయసులోనూ టీవీ రంగంలో చక్రం తిప్పుతుంది. ఆమె మరెవరో కాదు.. శ్వేతా తివారీ. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. శ్వేత 2000 నుండి 2024 వరకు తన కెరీర్ మొత్తంలో అనేక టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, చిత్రాలలో నటించింది. ఆమె తన నటనతో టెలివిజన్‌లోనే కాకుండా చలనచిత్ర పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

శ్వేతా తివారీ తన కెరీర్‌ను నటనతో కాదు, ఒక ట్రావెల్ ఏజెన్సీతో ప్రారంభించింది. ఆ సమయంలో ఆమెకు 500 రూపాయలు జీతం లభించింది. ఆమె జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కొంది. కానీ ఆమె ఎప్పుడూ ఆమె ధైర్యాన్ని వదులుకోలేదు. ఏక్తా కపూర్ నిర్మించిన “కసౌతి జిందగీ కి” షోలో ప్రేరణ పాత్ర పోషించి శ్వేతా తివారీ గుర్తింపు పొందింది. ఆ తర్వాత “బిగ్ బాస్” టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఆమె 23 సంవత్సరాల కెరీర్‌లో మొత్తం ఐదు చిత్రాలలో నటించింది.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

శ్వేతా తివారీ మొదట 1998లో రాజా చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి పాలక్ తివారీ అనే అమ్మాయి జన్మించింది. కానీ తన భర్త తనపై గృహహింసకు పాల్పడుతున్నాడంటూ అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది. తొమ్మిది సంవత్సరాలపాటు తన భర్త చేతిలో గృహ హింసను భరించానని తెలిపింది. ఆమె 2007లో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ జంట 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2013లో నటుడు అభినవ్ కోహ్లీని మళ్ళీ వివాహం చేసుకుంది. వీరికి బాబు ఉన్నాడు. రెండవ భర్తతోనూ డివోర్స్ తీసుకుని.. ఇప్పుడు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..