
తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. కట్ చేస్తే బాలీవుడ్ లో చక్రం తిప్పింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి సవాళ్లు.. ఎన్ని అడ్డంకులైనా దాటి గమ్యాన్ని చేరొచ్చు అని నిరూపించుకుంది. ఇక ఇప్పుడు సినీరంగంలో భారీ విజయాన్ని సాధించింది.సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్.. అంతకు ముందు వివిధ రంగాల్లో పనిచేసినవారే. ఓ హీరోయిన్ మాత్రం ఇంజనీరింగ్ చదివి నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలను అందుకుంది. తెలుగు సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఇప్పుడు ఆమె బీటౌన్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ దిశా పటానీ. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 33 సంవత్సరాలు. ఇప్పటికీ తన గ్లామరస్, స్టైలీష్ లుక్స్ తో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా మారడానికి ముందు చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండే ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది.
లక్నోలోని అమిటీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పూర్తి చేసింది. అదే సమయంలో నటనపై ఆసక్తి కలగడంతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబై వెళ్లింది. ఆ సమయంలో కేవలం రూ.500 మాత్రమే ఆమె వద్ద ఉన్నాయని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. తొలినాళ్లల్లో రూం రెంట్ కట్టేందుకు సైతం ఎంతో ఇబ్బంది పడ్డానని.. కానీ ఎప్పుడూ తన ఆశ మాత్రం వదులుకోలేదని తెలిపింది. నటిగా మారేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో సినీరంగంలోకి కథానాయికగా అరంగేట్రం చేసింది. 2015లో విడుదలైన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వచ్చాయి. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవలే ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడీ సినిమాలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..