AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కడున్నా.. ఎంత బిజీగా ఉన్నా వచ్చి అవార్డులు తీసుకోవాల్సిందే.. చిత్రపరిశ్రమకు దిల్‌రాజు సూచన!

సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల సక్సెస్‌పై ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకాని కొందరు నటీనటులు, దర్శకనిర్మాతలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. మీరు ఎక్కడున్నా సరే ప్రభుత్వాలు అందించే అవార్డులను స్వయంగా పంక్షన్‌కు వచ్చి తీసుకోవాల్సిందేనన్నారు. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరిపై ఉందన్నారు.

ఎక్కడున్నా.. ఎంత బిజీగా ఉన్నా వచ్చి అవార్డులు తీసుకోవాల్సిందే.. చిత్రపరిశ్రమకు దిల్‌రాజు సూచన!
Dil Raju
Anand T
|

Updated on: Jun 15, 2025 | 10:39 PM

Share

ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్‌లో శనివారం నాడు గ్రాండ్‌గా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్‌కి చెందిన అనేకమంది సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఈవెంట్‌తో టాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. అయితే తెలంగాణలో జరిగినట్లే, ఏపీలో కూడా ఫిల్మ్ అవార్డుల వేడుకను అక్కడి ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.

ఈ నేపథ్యంలో…టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులకు బడా నిర్మాత దిల్‌ రాజు విజ్ఞప్తి చేశారు. అందరికీ చెబుతున్నా.. గుర్తు పెట్టుకోండి…అవార్డులు వచ్చినవాళ్లు స్వయంగా ఫంక్షన్‌కు వచ్చి స్వీకరించాలని దిల్ రాజు కోరారు. ఏ స్టేట్‌ అయినా, షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనన్నారు ఆయన. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరిపై ఉందని, ఈ విషయాన్ని అందరు అర్థం చేసుకోవాలన్నారు FDC చైర్మన్‌.

అయితే తెలంగాణ సర్కార్ వైభవోపేతంగా నిర్వహించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌కు అవార్డులు వచ్చిన కొందరు నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరు కాలేదు. తమకు వచ్చిన అవార్డులను కూడా స్వీకరించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే దిల్‌ రాజు ఈ విజ్ఞప్తి చేసి ఉంటారని టాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఏపీలో జరగబోయే సినీ అవార్డుల ఫంక్షన్‌కు కూడా వాళ్లు డుమ్మా కొట్టకుండా ఉండేందుకు ఆయన ఈ కామెంట్లు చేశారని భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
మామిడి టెంకలతో అద్భుతమైన అందం! చర్మం, జుట్టు సమస్యలకు దివ్యౌషధం!
మామిడి టెంకలతో అద్భుతమైన అందం! చర్మం, జుట్టు సమస్యలకు దివ్యౌషధం!
మీ కళ్లకు పరీక్ష.. ఆ 2 బేసి సంఖ్యలను 11 సెకన్లలో కనిపెట్టగలరా?
మీ కళ్లకు పరీక్ష.. ఆ 2 బేసి సంఖ్యలను 11 సెకన్లలో కనిపెట్టగలరా?
మారుతి సుజుకి కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు!
మారుతి సుజుకి కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు!
అనారోగ్యంతో నటుడు మృతి.. స్టార్ హీరో ఎమోషనల్..
అనారోగ్యంతో నటుడు మృతి.. స్టార్ హీరో ఎమోషనల్..
ఛీ.. ఛీ.. ఇదేం సెలెక్షన్? బంగారం లాంటి ప్లేయర్‌ను కాదని..
ఛీ.. ఛీ.. ఇదేం సెలెక్షన్? బంగారం లాంటి ప్లేయర్‌ను కాదని..
పెరుగును ఎప్పుడు, ఎలా తినాలి..? ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలను..
పెరుగును ఎప్పుడు, ఎలా తినాలి..? ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలను..
సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న ట్యాలెంటెడ్ హీరో! కారణమేమిటంటే?
సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న ట్యాలెంటెడ్ హీరో! కారణమేమిటంటే?
వానరాల మజాకా.. ఎండ వేడికి చెక్ పెడుతూ ఏం చేస్తున్నాయో చూస్తే...
వానరాల మజాకా.. ఎండ వేడికి చెక్ పెడుతూ ఏం చేస్తున్నాయో చూస్తే...