Prabhas : ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్.. సాహో మూవీకి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజాసాబ్, ఫౌజీ చిత్రాలు షూటింగ్ జరుపుతుండగా.. త్వరలోనే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. ఇవే కాకుండా త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ సినిమాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అదేంటంటే..

Prabhas : ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్.. సాహో మూవీకి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా..
Saaho Movie

Updated on: Sep 03, 2025 | 6:40 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటీవలే కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సాహో సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. సాహో మూవీ కోసం ముందుగా కత్రినా కైఫ్ ను సంప్రదించారు మేకర్స్. కానీ ఆమె ఈ సినిమా చేసేందుకు నిరాకరించిందని టాక్. చివరకు ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారు. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.435 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలోనే ఈ చిత్రం రూ.150 కోట్ల నికర కలెక్షన్లను క్రాస్ చేసింది.

ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..

సాహో కోసం కత్రినా కైఫ్ మొదటి ఎంపిక కానీ బాహుబలి 2 విడుదలకు ముందు ఆ పాత్రను తిరస్కరించింది. అయితే ఆమె కోసం మేకర్స్ దాదాపు 6 నెలలు వెయిట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..

ఇవి కూడా చదవండి :  Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..

ఇవి కూడా చదవండి : Cinema : ఇదేం సినిమా రా బాబోయ్.. యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులతో బుర్రపాడు.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది..