Tollywood: రెండు సార్లు జైలుకు వెళ్లిన కుర్రాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరో.. ఇంతకీ ఎవరంటే..

ప్రస్తుతం అతడు పాన్ ఇండియా స్టార్ హీరో. వరుసగా హిట్ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల అతడు నటించిన లేటేస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. నార్త్ టూ సౌత్ ఇండస్ట్రీలో ఈ మూవీ సత్తా చాటింది. కానీ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ముందు అతడు అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు.

Tollywood: రెండు సార్లు జైలుకు వెళ్లిన కుర్రాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరో.. ఇంతకీ ఎవరంటే..
Vicky Kaushal

Updated on: May 03, 2025 | 2:04 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో అతడు స్టార్ హీరో. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టార్ హీరోలను సైతం వెనక్కు నెట్టేసి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. అతడు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అంతేకాదు.. ప్రతి సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూల్లు చేశాయి. ఇంతకీ ఈ హీరో తెలుసా.. ? అతడే బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో అతడు ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారారు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ శిష్యుడే విక్కీ కౌశల్. అనురాగ్ దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్”కు విక్కీ కౌశల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

విక్కీ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ, సినిమా గురించి తెలుసుకున్న తర్వాత నటన వైపు వచ్చాడు. కెరీర్ తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. 2015ల మాసాన్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఉధమ్ సింగ్, ఉరి సర్జికల్ స్ట్రైక్, మన్మర్జియాన్, సంజు వంటి చిత్రాల్లో నటించాడు. తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో హీరోగా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఛావా చిత్రం రికార్డ్స్ కొల్లగొట్టింది.

శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే విక్కీ కౌశల్ రెండుసార్లు జైలుకు వెళ్లాడని గతంలో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అనుమతి లేకుండా ఒక ప్రదేశంలో షూటింగ్ చేశామని.. అప్పుడు అది అక్రమ ఇసుక గని అని తెలిసిందని.. ఇసుక మాఫియా జరిగిన ఆ ప్రదేశంలో కాల్పులు జరిపినందుకు విక్కీ రెండుసార్లు అరెస్ట్ అయ్యాడని రెండుసార్లు జైలుకు వెళ్లాడని అనురాగ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..