
ప్రస్తుతం సినీరంగంలో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.. ఒకప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు తినడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. సినిమాల్లోకి రాకముందు అతడు లైట్ మ్యాన్‌గా, కార్మికుడిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో సీరియల్స్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో సహాయ నటుడిగా నటించాడు. అతడు కొన్ని పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన అతడు.. ఇప్పుడు హీరోగా మారాడు. అతడు మరెవరో కాదు.. సూరి.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
తమిళ సినిమా ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూరి. ఒకప్పుడు కమెడియన్ గా అనేక చిత్రాల్లో నటించారు. తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ కాగా.. తెలుగు ప్రేక్షకులకు సైతం సూరి దగ్గరయ్యాడు. సినిమా రంగంలోకి రాకముందు సూరి తిరుప్పూర్ బన్యన్ కంపెనీలో పనిచేసేవాడు. కొన్ని ఇంటర్వ్యూలలో తనకు రోజుకు రూ. 20 జీతం వచ్చేదని చెప్పుకొచ్చాడు. కానీ ఇన్నాళ్లు హాస్యనటుడిగా మెప్పించిన సూరి.. విడుదల సినిమాతో హీరోగా మారాడు. ఈమూవీతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు.
Soori Movie S
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో అలరిస్తున్న సూరి.. మరోవైపు వ్యాపారరంగంలోనూ దూసుకుపోతున్నాడు. మధురైలో ఒక రెస్టారెంట్ కూడా నడుపుతున్నాడు. ఇప్పుడు మందాడి అనే చిత్రంలో నటిస్తున్నాడు సూరి.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‌తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..