Tollywood : స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన విలన్.. మద్యానికి బానిసై.. చివరకు..

దక్షిణాదిలో అతడు ఫేమస్ నటుడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో సహయ నటుడిగా, విలన్ పాత్రలలో నటించి మెప్పించాడు. అంతేకాదు.. అప్పట్లోనే విలన్ పాత్రలకు స్టైలీష్ లుక్ ఇచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. హీరోలకు ధీటుగా స్టైలీష్ ‏గా కనిపిస్తూ సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

Tollywood : స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన విలన్.. మద్యానికి బానిసై.. చివరకు..
Raghuvaran

Updated on: May 10, 2025 | 2:08 PM

సౌత్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలతో వెండితెరపై రఫ్పాడించారు. అప్పట్లో విలన్ అంటే పెద్ద జుట్టు, గుబురు గడ్డంతో చూసేందుకు భయంకరంగా కనిపించేవారు. కానీ విలన్లకు సైతం స్టైలిష్ లుక్ ఇచ్చిన మొదటి వ్యక్తి ఈ నటుడు. హీరోలాగే స్టైలీష్ గా కనిపిస్తూ పవర్ ఫుల్ విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు, కన్నడ, తమిళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. విలన్ పాత్రలలో భయపెడుతూనే.. అటు హీరోలకు తండ్రిగానూ కనిపించాడు. అప్పట్లో తన లుక్, యాక్టింగ్ తో స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టించారు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న యాక్టర్ ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదండి.. దివంగత నటుడు రఘువరన్. దక్షిణాదిలో ఒకప్పుడు పాపులర్ యాక్టర్.

సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు 170కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే రజినీ సినిమా అంటే.. తలైవా స్టైల్, మ్యానరిజం ముందు ఇతర నటీనటులను అడియన్స్ అంతగా పట్టించుకునేవారు కాదు. ఆయన చిత్రాల్లో ఎంతో మంది పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రజినీ మాట్లాడుతూ సినిమాల్లో తనకు గట్టిపోటీ ఇచ్చి సవాలు చేసిన ఒకే ఒక్క నటుడు రఘవరన్ అని అన్నారు. “నా సినిమాల్లో ఎంతో మంది మంచి నటులు విలన్ పాత్రలు పోషించారు. కానీ నన్ను సవాలు చేసిన ఏకైక విలన్ రఘువరన్ మాత్రమే” అని అన్నారు రజినీ.

అలాగే తన సినిమాల్లో ఇప్పటివరకు నటించిన హీరోయిన్లలో రమ్యకృష్ణ ప్రత్యేకమని అన్నారు. నరసింహ సినిమాలో నీలాంభరి పాత్రలో ఆమె నటన అద్భుతమని.. తనకు పోటీగా నటనతో కట్టిపడేసిందని అన్నారు. ఇదిలా ఉంటే.. భాషా చిత్రంలో మార్క్ ఆంటోనీ పాత్రలో రఘువరన్ నటించారు. అప్పటివరకు విలన్ అంటే భయానకంగా కనిపించాలి, బిగ్గరగా మాట్లాడాలి అనే ట్రెండ్ ని రఘువరన్ బ్రేక్ చేశాడు. బిగ్గరగా డైలాగ్స్ చెప్పకుండా కేవలం సింపుల్ గా మాట్లాడుతూనే అదరగొట్టాడు. రఘువరన్ తెలుగులో నాగార్జున నటించిన శివ, మాస్ చిత్రాల్లో నటించారు. అలాగే చిరంజీవితో కలిసి పసివాడి ప్రాణం వంటి సినిమాల్లో కనిపించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రఘువరన్ .. మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యపానం చేయడంతో అవయవాలు ఫెయిల్ కావడంతో 2008 మార్చి 19న 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన 1996లో నటి రోహిణిని వివాహం చేసుకున్నారు. 2004లో వీరిద్దరు విడిపోయారు. వీరికి రిషివరన్ అనే కుమారుడు ఉన్నారు.

Raghuvaran New

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..