AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అంతే.. ఏకంగా అభిమాని చేతిలోనే కిడ్నాప్‌.. చివరకు..

మన దేశంలో సినిమా తారలు, క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకసారి మనసుకు నచ్చితే చాలు గుండెల్లో గుడి కట్టేసుకుంటారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ బ్యూటీ క్రేజ్ ఏపాటిది అంటే.. ఒకసారి ఏకంగా అభిమాని చేతిలోనే కిడ్నాప్ కు గురైంది.

Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అంతే.. ఏకంగా అభిమాని చేతిలోనే కిడ్నాప్‌.. చివరకు..
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 10, 2025 | 3:17 PM

Share

పై ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో అయితే వెంకటేష్, రవితేజ, రాజశేఖర్, ప్రభాస్, బాలకృష్ణ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తమిళంలో అయితే ఈ అమ్మడి క్రేజ్ నెక్ట్స్ లెవెల్. ఈ బ్యూటీ అందానికి ఫిదా అయిన అభిమానులు అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టేసి పూజలు చేశారు. అంతేకాదు.. ఒక అభిమాని ఏకంగా ఈ అందాల తారను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం పకడ్బందీగా కిడ్నాప్ ప్లాన్ కూడా వేశాడు. అయితే అదేమీ జరగకపోవడంతో సదరు హీరోయిన్ ఊపిరి పీల్చుకుంది. మరి అభిమాని చేతిలో కిడ్నాప్ కు గురైన ఆ హీరోయిన్ మరెవరో కాదు బొద్దుగుమ్మ నమిత. శనివారం (మే10) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో నమితకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీగా ఉంటోంది నమిత. 2020లో ఓ తమిళ సినిమాలో చివరిగా కనిపించిందీ అందాల తార. ఆ మధ్యన కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా పాల్గొంది. బీజేపీ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరింది. అలాగే అప్పుడప్పుడూ తమిళ రాజకీయాలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటుందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

నమిత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది నమిత. ఈ జంటకు 2022లో కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే ఎక్కువగా గడిపేస్తుందీ అందాల తార. మరి చాలామందిలాగే ఈ ముద్దుగుమ్మ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందో లేదో చూడాలి.

భర్తతో నమిత..

గ్లామరస్ లుక్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?