
సినీరంగంలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కానీ ఒకప్పుడు బేకరీలో తాను తిన్నదానికి రూ.18 బిల్లు కాగా.. జేబులో రూ.17 ఉన్న ఓ వ్యక్తి.. ఒక్క రూపాయి కోసం ఎంతో అల్లాడిపోయిన కుర్రాడు.. జీవితం ఎటుపోతుందో అని ఎంతగానో ఆలోచించిన వ్యక్తి.. ఇప్పుడు నటుడిగా కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా, దర్శకుడిగా సినీరంగుల ప్రపంచంలో తనదైన ముద్రవేశాడు. ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. జీవితంలో జరిగిన ఒక్క సంఘటనతో సినిమా వైపు అస్సలు వెళ్లకూడదు అనుకున్న వ్యక్తి.. ఇప్పుడు వరుసగా అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడలో సినిమాలు చేస్తున్నాడు. అతడు మరెవరో కాదు.. కాంతార సినిమాతో సంచలనం సృష్టించిన హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు.
కర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు రిషబ్ శెట్టి. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేవాడు. జూడో పోటీల్లో ఎన్నో పతకాలు సాధించారు. చిన్నప్పుడు దూరదర్శన్ లో వచ్చే హీరో రాజ్ కుమార్ పాటలు ఎక్కువగా వినే రిషబ్ శెట్టి.. అప్పుడే నటుడు కావాలనుకున్నారు. డిగ్రీ పూర్తి కాకుండానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ కోసం డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరారు. అదే సమయంలో ఖర్చుల కోసం మినరల్ వాటర్ అమ్మకం వ్యాపారం స్టార్ట్ చేశారు. రాత్రంతా నీళ్లు సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయి ఉదయాన్నే తన అక్క ఇంటికి వెళ్లేవారు. రిషబ్ శెట్టి వాటర్ సప్లై చేస్తున్న క్లబ్ కు కన్నడ నిర్మాత ఎండి. ప్రకాష్ రాగా.. తనకు ఛాన్స్ అడిగారట. అలా సైనైడ్ చిత్రానికి సహయ దర్శకుడిగా అవకాశం ఇప్పించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారిన రిషబ్ శెట్టి తుగ్లక్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈసినిమా పరాజయం కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు.
ఆ తర్వాత రక్షిత్ శెట్టితో కలిసి తెరకెక్కించిన కిరిక్ పార్టీ సినిమా భారీ విజయాన్న అందుకుంది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా మారారు రిషబ్ శెట్టి. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన కాంతార సినిమా రికార్డ్స్ సృష్టించింది. ఇందులో ప్రధాన పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హనుమాన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కాంతార 2 పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..