AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు 500 జీతం.. ఇప్పుడు ఒక్క ఎపిసోడ్‎కు రూ.5 కోట్లు.. బుల్లితెరపై రారాజు..

ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయి. చిన్న వయసులోనే తండ్రి మరణంతో కుటుంబం బాధ్యతను తీసుకున్నాడు. చిన్నప్పుడే ఆత్మ విశ్వాసంతో పని చేస్తూ ఫ్యామిలీని పోషించాడు. ఒకప్పుడు రూ.500 జీతం తీసుకున్న ఇప్పుడు ఒక్క ఎపిసోడ్‏కు రూ.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు అతడు బుల్లితెరపై రారాజు. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: ఒకప్పుడు 500 జీతం.. ఇప్పుడు ఒక్క ఎపిసోడ్‎కు రూ.5 కోట్లు.. బుల్లితెరపై రారాజు..
Actor
Rajitha Chanti
|

Updated on: May 25, 2025 | 9:33 AM

Share

సినీరంగుల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనేక సంవత్సరాల పోరాటం తర్వాత సక్సెస్ అయ్యారు. ఎన్నో అడ్డంకులను అధిగమించాడు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబం బాధ్యతను తీసుకున్నాడు. చిన్నప్పుడే ఫ్యామిలీ కోసం పనులు చేయడం స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు రూ.500 జీతం తీసుకున్న ఈ నటుడు ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ కు రూ.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. పైన ఫోటోలో టోపీ పెట్టుకున్న కుర్రాడు బాల్యాన్ని అమృత్‌సర్‌లో పేదరికంలో చాలా కష్టా్ల్లో గడిపాడు. అతడి తండ్రి పోలీసు శాఖలో పనిచేసేవాడు. కానీ దురదృష్టవశాత్తు క్యాన్సర్ తో అతడు మరణించాడు. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో చిన్న వయసులోనే టెలిఫోన్ బూత్, ఒక టెక్స్‌టైల్ మిల్లులో పనిచేశాడు. అప్పుడు అతడి జీతం రూ.500. అయినా నిరంతరం తన పనిని వదులుకోలేదు.

పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు మరెవరో కాదు.. హిందీ బుల్లితెర కమెడియన్ కపిల్ శర్మ. చిన్న వయసులోనే తన కామెడీ టైమింగ్, పంచులతో చిన్న చిన్న స్టేజ్ షోలలో పాల్గొనడం ప్రారంభించాడు. 2007లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ షో గెలిచిన తర్వాత అతని అదృష్టం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత కామెడీ నైట్స్ విత్ కపిల్, ది కపిల్ శర్మ షోలతో మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ది గ్రేట్ ఇండియన కపిల్ షో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 192 దేశాలలో ఈ షో ప్రసారమవుతుంది. నివేదికల ప్రకారం ఈ షోకు ఒక్క ఎపిసోడ్ కు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటాడట.

కపిల్ శర్మ కామెడీ టైమింగ్, యాక్టింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. అలాగే 2015లో కిస్ కిస్ కో ప్యార్ కరూన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. ఇక అతడు నటించిన కిస్ కిస్ కో ప్యార్ కరూన్ 2 సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..