AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: టెంపర్ సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ? ఎన్టీఆర్ కంటే ముందు అనుకున్న స్టార్ ఎవరంటే..

కొన్నిసార్లు సినీరంగంలో ఒక హీరో కోసం రాసుకున్న కథలు మరో హీరో వద్దకు వెళ్తుంటాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఇండస్ట్రీలలోనూ ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోల విషయంలోనూ ఇలాగే జరిగింది. కానీ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా..?

Jr.NTR: టెంపర్ సినిమాను మిస్సైన హీరో ఎవరో తెలుసా.. ? ఎన్టీఆర్ కంటే ముందు అనుకున్న స్టార్ ఎవరంటే..
Temper Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2025 | 1:05 PM

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన అప్ కమింగ్ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. దేవర సూపర్ హిట్ తర్వాత ఇన్నాళ్లు వార్ 2 షూటింగ్ లో ఉన్న తారక్.. ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ఇదిలై ఉంటే.. ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ టెంపర్. వరుస డిజాస్టర్లతో తారక్ డౌన్ అవుతున్న సమయంలో భారీ విజయాన్ని అందుకుని తారక్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా టెంపర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. దాదాపు 35 కోట్లతో నిర్మించిన ఈ మూవీ అప్పట్లోనే రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు.

అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్ మరో హైలెట్. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని హిందీ, తమిళంలో రీమేక్ చేయగా.. అక్కడ సైతం భారీ విజయాన్ని అందుకుంది. హిందీలో ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ మీకు తెలుసా.. ? టెంపర్ సినిమాకు ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమాను నిజానికి మాస్ మహరాజా రవితేజతో చేయేల్సిందట.

టైటిల్, డైరెక్టర్ ఫిక్సైనా తర్వాత అనుహ్యంగా తారక్ వద్దకు వచ్చింది. 2014లోనే రవితేజతో ఈ సినిమా చేయాలనుకున్నారట డైరెక్టర్ మెహర్ రమేశ్. కానీ ఆ సమయంలోనే వక్కంతం వంశీ చెప్పిన టెంపర్ కథ నచ్చడంతో అదే చిత్రాన్ని చేయాలనుకున్నారు. ఈ సినిమాకు ముందుగా పవర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ కొన్నాళ్లకే ఈ సినిమా ఆగిపోయింది. దీంతో చివరకు ఈ స్టోరీ ఎన్టీఆర్ వద్దకు చేరింది.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

ఇవి కూడా చదవండి :  

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..