గత కొద్దిరోజులుగా బాక్సాఫీస్ వద్ద కాంతార సినిమా సత్తా చాటుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రై మ్ లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అటు ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇప్పుడు మాత్రం నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కాంతార మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ప్రేక్షకులకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసుకుందామా.
డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలోని క్లైమాక్స్‌తో పాటు .. వరాహరూపం పాట కూడా అభిమానులకు నచ్చేసింది. సినిమా హిట్ అవ్వడంలో ఈ పాట కూడా కీలక పాత్ర పోషించింది. అయితే కాంతార సినిమాలోని వరహరూపం పాటను తొలగించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనే కాదు..అటు ఓటీటీలోనూ ఈ సాంగ్ వినిపించడం లేదు. ఈ పాటపై కేరళ రాక్ బ్యాండ్ తెక్కుడం బ్రిడ్జ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2017 తాము రూపొందించిన నవరసాం ట్యూన్ వరహరూపం పాట కోసం కాపీ కొట్టారని అని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాక్ బ్యాండ్ తెక్కుడం బ్రిడ్జ్ కోజికోడ్ కోర్టును ఆశ్రయించగా స్థానిక కోర్టు కూడా పాట కాపీ చేయబడిందని, దానిని ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. కోజికోడ్ కోర్టుతో పాటు, పాలక్కాడ్ జిల్లా కోర్టు కూడా పాటను నిషేధించింది.
ఇప్పుడు అదే పాటను చిత్ర నిర్మాతలు ఉపయోగించలేరు. కానీ ఓటీటీలో విడుదలైన కాంతార సినిమాలోని వరాహ రూపం పాటలోని సాహిత్యాన్ని ఉంచి, దాని ట్యూనింగ్ మార్చారు. కానీ మార్చిన ట్యూన్ మాత్రం అభిమానులకు అస్సలు నచ్చలేదు. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా వేదికంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాటను మార్చడం ద్వారా సినిమా ఆత్మ కోల్పోయిందని.. వరహ రూపం కొత్త ట్యూన్ బాలేదని.. వరాహ రూపం సాంగ్ థియేటర్‌లో అద్భుతంగా కనిపించింది, పాత వరహ రూపాన్ని తిరిగి తీసుకురావాలి లేదా అమెజాన్ ప్రైమ్ నుండి తీసివేయాలి అని ట్వీట్ చేస్తున్నారు. దీంతో సినిమాకు నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
#Kantara climax with original Varaha Roopam song version ??pic.twitter.com/t6FriI6uxW
— AmuthaBharathi (@CinemaWithAB) November 24, 2022
#Kantara peaked here?❤️?pic.twitter.com/ybbAm6pBmE
— AmuthaBharathi (@CinemaWithAB) November 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.