Year Ender 2023: ఈ ఏడాది ఖరీదైన కార్లను కొన్న సెలబ్రెటీస్.. యష్ నుంచి పూజా హెగ్డే వరకు..

వరుస డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరి అయిన బాలీవుడ్.. ఈ ఏడాది కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ ఏడాది బీటౌన్ ఇండస్ట్రీలో మొత్తం నాలుగు సినిమాలు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరాయి. సౌత్ ఇండియాలోనూ చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే సినీ తారలు చాలా మంది ఈ ఏడాది వరుసగా తమ కలలను సాకారం చేసుకున్నారు. నచ్చిన లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. మరీ ఈ సంవత్సరం బాలీవుడ్ టూ టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు ఎవరెవరు కార్లు తీసుకున్నారో చూద్దామా.

Year Ender 2023: ఈ ఏడాది ఖరీదైన కార్లను కొన్న సెలబ్రెటీస్.. యష్ నుంచి పూజా హెగ్డే వరకు..
Pooja Hegde, Rakul Preeth S

Edited By:

Updated on: Dec 20, 2023 | 3:18 PM

కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. 2023 ఏడాది ముగిసి 2024 రావడానికి ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టాయి. వరుస డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరి అయిన బాలీవుడ్.. ఈ ఏడాది కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ ఏడాది బీటౌన్ ఇండస్ట్రీలో మొత్తం నాలుగు సినిమాలు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరాయి. సౌత్ ఇండియాలోనూ చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే సినీ తారలు చాలా మంది ఈ ఏడాది వరుసగా తమ కలలను సాకారం చేసుకున్నారు. నచ్చిన లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. మరీ ఈ సంవత్సరం బాలీవుడ్ టూ టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు ఎవరెవరు కార్లు తీసుకున్నారో చూద్దామా.

యష్
‘కేజీఎఫ్ 2’ హిట్ తర్వాత యష్ పాన్ ఇండియా స్టార్ క్రేజ్ అందుకున్నాడు. ఇటీవలే ఆయన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘టాక్సిక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యష్ చాలా ప్రతిష్టాత్మక బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ ఏడాది యష్‌కి కొత్త లగ్జరీ కారు తీసుకున్నాడు. యష్ జూన్ నెలలో రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఈ కొత్త రేంజ్ రోవర్ కారు ధర 4 కోట్ల రూపాయలు.

అలియా భట్
ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యింది అలియా. ఇటీవలే ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’తో హిట్ అందుకుంది. ఈ ఏడాది హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది ఈ బ్యూటీ. కొన్ని నెలల క్రితం రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB లగ్జరీ SUVని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుని తన కూతురు రాహాతో సమయం కేటాయిస్తుంది.

శ్రద్ధా కపూర్
బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది శ్రద్ధా కపూర్. ఈ సంవత్సరం ఆమెకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఏడాది తనకు ఇష్టమైన లాంబోర్గినీ హురాకాన్ కారు కొనుగోలు చేసింది.

రూపాలీ గంగూలీ
బుల్లితెర నటి రూపా గంగూలీకి చాలా ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది Mercedes Benz GLE 300D కారును కొనుగోలు చేసింది. ఈ కారు విలాసవంతమైనది.

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్.. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ అటు హిందీలోనూ సినిమాలు చేయడం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ ఏడాది Mercedes Maybach GLS 600 SUVని కొనుగోలు చేసింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కొన్నాళ్లుగా రూ.200 కోట్ల మోసం కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తోపాటు.. జాక్వెలిన్ ను విచారించారు పోలీసులు. ఈ ఏడాది జాక్వెలిన్ బిఎమ్‌డబ్ల్యూ ఐ7 కారు కొనుగోలు చేసింది. దీని ధర 2 కోట్ల రూపాయలు.

పూజా హెగ్డే
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. చాలా కాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. అయినా నెట్టింట మాత్రం తెగ సందడి చేస్తుంది. ఈ ఏడాది రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. దీని ధర 4 కోట్ల రూపాయలు.

తాప్సీ పన్ను
‘డంకీ’ నటి తాప్సీ పన్ను రూ. 3.46 కోట్లతో మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. గణేష్ చతుర్థి సందర్భంగా ఆమె ఈ కారును కొనుగోలు చేసింది.

షాహిద్ కపూర్
షాహిద్ కపూర్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 కారును కొనుగోలు చేశాడు. షాహిద్ కపూర్, అతని భార్య మీరా కపూర్ కలిసి షోరూమ్‌కి వెళ్లి కారు తీసుకున్నారు. ఈ ఫోటోను మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.