Salaar: కేజీఎఫ్ చిత్రంలోని ఆ కుర్రాడికి… ప్రభాస్ సలార్ సినిమాకు ఉన్న సంబంధమేంటో తెలుసా ?..

సలార్ సినిమాను హోంబలే ఫిలింస్ నిర్మిస్తుండగా.. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్ చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రూర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.

Salaar: కేజీఎఫ్ చిత్రంలోని ఆ కుర్రాడికి... ప్రభాస్ సలార్ సినిమాకు ఉన్న సంబంధమేంటో తెలుసా ?..
Kgf, Salaar

Updated on: Jan 26, 2023 | 4:39 PM

యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ నిర్మిస్తుండగా.. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్ చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రూర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అయితే ఇప్పటికే సలార్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సలార్ చిత్రానికి కేజీఎఫ్ సినిమాకు ఓ సంబంధం ఉందట. కేజీఎఫ్ చిత్రంలోని కుర్రాడికి.. ప్రభాస్ పాత్రకు లింక్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కేజీఎఫ్ 2లో ఓ కుర్రాడు ఉన్నాడు గుర్తుందా ?. తన తల్లికి ఇష్టం లేకపోయినా కేజీఎఫ్ కు కాపలా కాసే టీంలో చేరతాడు. కానీ అధీర ముఠా దాడిలో ఈ కుర్రాడు చనిపోతాడు. అతడి శవాన్ని చూసి ఆ తల్లి కూడా బోరున విలపిస్తుంది. అయితే ఆ కుర్రాడు చనిపోలేదని.. అతడే సలార్ గా మారతాడని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ట్వీట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఈ న్యూస్ మాత్రం నిజం కాదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు యష్ సలార్ చిత్రంలో నటించడం లేదని గతంలో హోంబలే నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు కేజీఎఫ్ చిత్రంలోని కుర్రాడికి ప్రభాస్ పాత్రకు లింక్ ఉన్నట్లు వస్తున్న వార్తలలో ఎంత వరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.