Chiranjeevi Birthday: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎంతో మంది స్టార్ హీరోలకు చిరు ఆదర్శం. ఈ విషయాన్ని నేరుగా వారే చెబుతుంటారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చామని చెప్పే యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. తన అద్భుత నటన, ఆకట్టుకునే డ్యాన్స్‌లతో ఓ తరాన్ని ఊపుఊపారు మెగాస్టార్. ఇక సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు చిరు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ల పేరుతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఎంతో మందికి అభిమాన నటుడు అయిన చిరు జన్మదినం నేడు (ఆగస్టు 22). ఈ సందర్భంగా మెగాస్టార్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ సందర్భంగా అసలు చిరు బ్లడ్ బ్యాంకు ఎందుకు ఏర్పాటు చేశారు.? దానికి దారి తీసిన సంఘటన ఏంటో తెలుసుకుందామా.?
తాను బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని చిరు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్యూలో చెప్పారు. ఓ రోజు చిరంజీవి న్యూస్ పేపర్ చదువుతోన్న సమయంలో ‘సమయానికి రక్తం అందక పలువురు ప్రాణాలు వదులుతున్నారు’ అన్న వార్తను చదివారు. ఇంతమంది ఉండి రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఏంటని ఆలోచించిన చిరు.. మరుసటి రోజే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. అలా 1998లో మొదలైన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవలు ఇప్పుడు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అయితే తన ప్రయత్నానికి ఎంతోమంది అభిమానులతో పాటు ఇతర ప్రజానీకం కలిసివచ్చిందని, వారందరి సహకారంతోనే బ్లడ్ బ్యాంక్‌ను విజయవంతంగా నడుపుతున్నానని చిరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Also Read: Naga Chaitanya: చైతూ కొత్త ప్రాజెక్ట్ అప్డేట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తో నాగచైతన్య న్యూమూవీ..